ఏపీ సీఈసీ రమేష్ కుమార్ కు భద్రత పెంపు

Published : Mar 19, 2020, 02:26 PM IST
ఏపీ సీఈసీ రమేష్ కుమార్ కు భద్రత పెంపు

సారాంశం

 ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం భద్రతను పెంచింది. గురువారం నాడు ఉదయం నుండి రమేష్ కుమార్ కు ప్రతి షిప్టులో నలుగురు గన్ మెన్లను సెక్యూరిటీగా నియమించారు.


అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం భద్రతను పెంచింది. గురువారం నాడు ఉదయం నుండి రమేష్ కుమార్ కు ప్రతి షిప్టులో నలుగురు గన్ మెన్లను సెక్యూరిటీగా నియమించారు.

ఏపీ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్  తన ప్రాణాలకు ముప్పు ఉందని కోరుతూ కేంద్ర హొంశాఖ కార్యదర్శికి లేఖ రాసినట్టుగా బుధవారం నాడు ఓ లేఖ బయటకు వచ్చింది.

అయితే ఈ లేఖను తాను రాయలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎఎన్ఐ వార్తా సంస్థకు చెప్పినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది,ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  బుధవారం నాడు రాత్రే హైద్రాబాద్ కు వెళ్లారు. 

also read:కేంద్రానికి లేఖపై ఏపీ ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ట్విస్ట్

గురువారం నాడు ఉదయం నుండి రమేష్ కుమార్ ఇంటి వద్ద భద్రతను పెంచింది ఏపీ ప్రభుత్వం. గతంలో రమేష్ కుమార్ కు 1+1 సెక్యూరిటీ ఉండేది.ఇవాళ  ఉదయం నుండి  రమేష్ కుమార్ ఇంటి వద్ద 4+4 సెక్యూరిటీని పెంచారు. బుధవారం నుండి రమేష్ కుమార్ ఎవరిని కలవలేదని సమాచారం.

ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబడుతోంది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: మ‌ళ్లీ దంచికొట్ట‌నున్న వ‌ర్షాలు.. ఏపీలో ఈ ప్రాంతాల‌కు అల‌ర్ట్
RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్? | YSRCP | Asianet News Telugu