తనకు ప్రాణహాని ఉందంటూ కేంద్ర హోంశాఖకు తాను ఎలాంటి లేఖ రాయలేదని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు.ఈ విషయాన్ని ఓ జాతీయ వార్తాసంస్థ ప్రకటించింది.
న్యూఢిల్లీ: తనకు ప్రాణహాని ఉందంటూ కేంద్ర హోంశాఖకు తాను ఎలాంటి లేఖ రాయలేదని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు.ఈ విషయాన్ని ఓ జాతీయ వార్తాసంస్థ ప్రకటించింది.
తనకు ప్రాణహాని ఉందని కేంద్ర హోంశాఖకు బుధవారం నాడు ఓ లేఖ అందింది. రమేష్ కుమార్ పేరుతో ఉన్న మెయిల్ ఐడీ నుండి కేంద్ర హోంశాఖకు ఈ లేఖ అందింది.
undefined
ఈ లేఖపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖకు ఈ లేఖ అందినట్టుగా హోంశాఖ వర్గాలు ధృవీకరించాయి.మరో వైపు ఏఎన్ఐ వార్తా సంస్థకు మాత్రం తాను కేంద్ర హోంశాఖకు ఎలాంటి లేఖ రాయలేదని రమేష్ కుమార్ చెప్పినట్టుగా ఆ వార్తా సంస్థ ప్రకటించింది.
కానీ, స్థానిక మీడియాతో ఈ విషయమై రమేష్ కుమార్ ఏం మాట్లాడలేదు. స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ వాయిదా వేశారు. ఈ ఎన్నికలను వాయిదా వేయడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది.
Also read:జగన్‌కు ఈసీ రమేశ్ కుమార్ మరో షాక్: కేంద్రానికి సీరియస్ లేఖ
ఈ విషయమై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల నిర్వహణ విషయంలో బుధవారం నాడు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై అధికార, విపక్షాలు కూడ పరస్పరం విమర్శలు చేసుకొన్నాయి.
బుధవారం నాడు సాయంత్రం రమేష్ కుమార్ తనకు భద్రత కల్పించాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్టుగా లేఖ బయటకు వచ్చింది. అయితే ఈ లేఖను తాను రాయలేదని రమేష్ కుమార్ చెప్పినట్టుగా ఎఎన్ఐ వార్తా సంస్థ ప్రకటించడం ప్రస్తుతం చర్చకు దారితీసింది.
ఈ లేఖ విషయమై రమేష్ కుమార్ స్పష్టత ఇవ్వాలని అధికార వైసీపీ డిమాండ్ చేస్తోంది.