టీటీడీ ట్రస్ట్ బోర్డు: 25 మందితో కొత్త సభ్యుల జాబితా విడుదల

By narsimha lode  |  First Published Sep 15, 2021, 3:59 PM IST

టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితాను ఏపీ ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్రలకు టీటీడీ బోర్డులో చోటు దక్కింది. బోర్డు సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులను కూడ ఏపీ ప్రభుత్వం నియమించింది.


అమరావతి: 25 మందితో టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితాను ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు విడుదల చేసింది. ఇప్పటికే టీటీడీ ఛైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు.టీటీడీ బోర్డు సభ్యులుగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, శశిధర్, కల్వకుర్తి విద్యాసాగర్, లక్ష్మీనారాయణ, మూరంశెట్టి రాములు, నందకుమార్, జూపల్లి రామేశ్వర్ రావు,. రాజేశర్మ, జీవన్ రెడ్డి, పార్ధసారథిరెడ్డి, పోలకల ఆశోక్, మల్లాడి కృష్ణారావు, శంకర్, విశ్వనాథ్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, గొల్ల బాబురావు.మధుసూదన్ యాదవ్ తదితరులకు చోటు దక్కింది.

also read:టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డితో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి భేటీ

Latest Videos

టీటీడీలో ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. కోస్తా నుండి కనిగిరి ఎమ్మెల్యే మధుసూధన్ యాదవ్ , ఉత్తరాంధ్ర నుండి పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు, రాయలసీమ నుండి కాటసాని రాంభూపాల్ రెడ్డకి చోటు దక్కింది. కర్ణాటక నుండి శశిధర్ , శంకర్, డాక్టర్ కేతన్ దేశాయ్ కి చోటు లభించింది.

తమిళనాడు నుండి కన్నయ్య, నందకుమార్ , జె. శ్రీనివాసన్, రాజేష్ శర్మ, జీవన్ రెడ్డి, సౌరభ్ లకు చోటు దక్కింది.మహారాష్ట్ర సీఎం కోటాలో మిలింద్ కు అవకాశం వచ్చింది. తెలంగాణ నుండి మూరంశెట్టి రాములు, నందకుమార్, జూపల్లి రామేశ్వరరావు, రాజేశర్మ, పార్ధసారథిరెడ్డి. జీవన్ రెడ్డిలకు చోటు దక్కింది.ప్రత్యేక ఆహ్వానితుల జాబితాను కూడ ఏపీ ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది. ఈ జాబితాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు.


 

click me!