టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డితో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి బుధవారం నాడు భేటీ అయ్యారు. టీటీడీలో తీసుకొచ్చిన సంస్కరణలపై ఆయన చర్చించారు. 25 మందితో పాలకవర్గ సభ్యుల జీవోను విడుదల చేయనున్నారు.
అమరావతి: టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డితో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి బుధవారం నాడు బేటీ అయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీలో అనేక అక్రమాలు చోటు చేసుకొన్నాయని గతంలో సుబ్రమణ్యస్వామి తీవ్రమైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే.వైవీ సుబ్బారెడ్డితో భేటీ తర్వాత సుబ్రమణ్యస్వామి ఏపీ సీఎం జగన్ తో భేటీ కానున్నారు. టీటీడీలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి చర్చించారు.
also read:టీటీడీ పాలకవర్గం: బోర్డు సభ్యుల జాబితా ఇదీ...
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మెన్ మీడియాతో మాట్లాడారు. 25 మందితో టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితాను విడుదల చేస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పాలకమండలిలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగుతారని ఆయన తెలిపారు. టీటీడీ పాలకమండలి సభ్యులకు సంబంధించి ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఆయన చెప్పారు.టీటీడీ ఛైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డి రెండో సారి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.