నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం శనివారం నాడు సెక్యూరిటీని తగ్గించింది.
నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి శనివారం నాడు ప్రభుత్వం భద్రతను తగ్గించింది. ప్రస్తుతం ఉన్న 2+2 గన్ మెన్లను 1+1 కి తగ్గించింది.తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని జగన్ సర్కార్ పై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ అవమానాన్ని సహించలేకపోయినట్టుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. అయితే టీడీపీలో చేరడానికి నిర్ణయం తీసుకుని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ నాయకత్వంపై విమర్శలు చేసిన నాలుగైదు రోజుల్లోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భద్రతను తగ్గించడం రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.
2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019లో ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జగన్ మంత్రివర్గంలో చోటు దక్కుతుందని శ్రీధర్ రెడ్డి భావించారు. అయితే తొలిసారి జగన్ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో అనిల్ కుమార్ కు అవకాశం దక్కింది.
undefined
ఆ తర్వాత మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో తనకు అవకాశం దక్కుతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భావించారు. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది. దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అవకాశం దొరికినప్పుడల్లా అధికారుల తీరుపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. టపనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో గత నెలలలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని జగన్ పిలిపించుకుని మాట్లాడారు. ఆ తర్వాత కొన్ని రోజులు స్థబ్ధుగా ఉన్నట్టుగా కన్పించారు.
ఆ తర్వాత వరుసగా సంచలన వ్యాఖ్యలకు తెర తీశారు. తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ విషయమై తన వద్ద ఆధారాలున్నాయన్నారు. ఈ విషయాన్ని బయటపెడితే ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలు పోతాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. శ్రీధర్ రెడ్డి ఆరోపణలకు కౌంటరిచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన నేతలతో జగన్ సమావేశమయ్యారు. నెల్లూరు రూరల్ వైసీపీ ఇంచార్జీగా మాజీ మంత్రి అదాల ప్రభాకర్ రెడ్డిని సీఎం జగన్ నియమించారు.