ఏపీ ప్రభుత్వం మహిళా సాధికారితకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది.ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
అమరావతి: women Empowerment ఏపీ బడ్జెట్ లో అధికంగా కేటాయింపులు చేసినట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana Rajendranath Reddy ఇవాళ AP Assemblyలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
NIti Ayog ప్రకటించిన లింగ సమానత్వం సూచీలో ఏపీ రాష్ట్రం రెండేళ్ల కాలంలో 12 ర్యాంకులు మెరుగుపర్చుకుని 5వ ర్యాంకును సాధించినట్టుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ Asara పథకం కింద మహిళా స్వయం సహాయక గ్రూపులకు రూ. 12,757.97 కోట్లను విడుదల చేశామని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన 78,74,438 అర్హత గల సభ్యులు పొందారని ఆర్ధిక మంత్రి తెలిపారు.2022-23 ఆర్ధిక సంవత్సరంలో వైఎస్ఆర్ ఆసరా పథకానికి రూ. 6,400 కోట్లు కేటాయించినట్టుగా మంత్రి చెప్పారు.
undefined
YSR సున్నా వడ్డీ పథకం కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక గ్రూపులకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. 2019-20, 2020-21 ఆర్ధిక సంవత్సరాల్లో 7,36,472 గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు రూ.1789 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రూ. 800 కోట్లు కేటాయించినట్టుగా మంత్రి చెప్పారు.
నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45l-60 ఏళ్ల లోపు మహిళలకు రూ. 75 వేల ఆర్ధిక సహాయం అందిస్తున్నట్టుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెడ్డి చెప్పారు.ఈ పథకాల కింద సుమారు 24.95 లక్షల మంది లబ్దిదారులు వివిధ జీవనోపాధి కార్యకలాపాలను ఎంచుకొన్నట్టుగా మంత్రి వివరించారు.పలు ప్రముఖమైన కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొన్న విషయాన్ని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు.
మహిళా అభివృద్ది, శిశు సంక్షేమ శాఖకు 2022-23 ఆర్ధిక సంవత్సరానికి రూ.4,322.86 కోట్లు ప్రతిపాదించినట్టుగా మంత్రి తెలిపారు. 2021-22 లో మొదటి సారి పిల్లలు, జెండర్ బడ్జెట్ ను ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.