తండ్రిని ఇనపరాడ్డుతో కొట్టి హత్య చేసి.. ఉరివేసుకుని ఆత్మహత్య.. ఆస్తి కోసం కొడుకు దారుణం...

Published : Mar 11, 2022, 12:00 PM IST
తండ్రిని ఇనపరాడ్డుతో కొట్టి హత్య చేసి.. ఉరివేసుకుని ఆత్మహత్య.. ఆస్తి కోసం కొడుకు దారుణం...

సారాంశం

ఆస్తి కోసం ఓ కొడుకు దారుణానికి తెగబడ్డాడు. తండ్రిని ఇనుపరాడ్డుతో కొట్టి అంతమొందించాడు. ఆ తరువాత ఏమనుకున్నాడో ఏమో.. తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

అద్దంకి : ఆస్తి వివాదం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా addnaki మండలం ధర్మవరం గ్రామంలో చోటు చేసుకుంది. property dispute కారణంగా గత కొన్ని రోజులుగా కుటుంబ తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ తండ్రి సీతారామయ్య, కుమారుడు శంకర్రావు ఘర్షణ పడ్డారు. తండ్రి సీతారామయ్యను శంకర్రావు ఇనుపరాడ్డుతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తరువాత శంకర్రావు ఇంట్లో ఉరి వేసుకుని suicideకు పాల్పడ్డాడు. ఒకే ఇంట్లో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచాం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

నిరుడు నవంబర్ లో ఆస్తి కోసం కన్నతండ్రినే హత్య చేసిన ఘటన భూపాలపల్లిలో చోటు చేసుకుంది. సింగరేణి కార్మికుడిని హత్య చేసిన కేసులో అతని కుమారుడు, కుమార్తెను అరెస్ట్  చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు భూపాలపల్లి సీఐ  ఎస్ వాసుదేవరావు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం... భూపాలపల్లి పట్టణంలోని టీ2 క్వార్టర్స్ లోని టీ2 -658 క్వార్టర్‌లో నివాసం ఉండే గొడ్డె నాగభూషణం(44) తన ఇంట్లో ఈ నెల 22 న రాత్రి హత్యకు గురయ్యాడు. మృతుడి రెండో భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ఎస్ వాసుదేవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

హత్య జరిగిన రోజు నుంచి నాగభూషణం కుమారుడు జగదీష్, కుమార్తె ఉమామహేశ్వరిలు పరారీలో ఉన్నారు. శుక్రవారం ఉదయం వారి దుస్తులు, డబ్బులు తీసుకువెళ్ళేందుకు భూపాలపల్లికి వచ్చారు. విషయం తెలుసుకున్న సీఐ తన సిబ్బందితో కలిసి వెళ్లి వారిని పట్టుకుని విచారించారు. పోలీసుల విచారణలో తామే హత్య చేసినట్టుగా నిందితులు అంగీకరించారు. తమ తండ్రి ఆగడాలు తట్టుకోలేకనే హత్యకు పాల్పడినట్టు వారు పేర్కొన్నారు. నాగభూషణం కుటుంబాన్ని పట్టించుకోకపోవడమే  కాక భార్యను వేధించేవాడు.అతడి వేధింపుల కారణంగానే అనారోగ్యానికి గురైన భార్య సుజాత మృతి చెందింది. 

దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 14న మరొకరిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం పిల్పిలలిద్ల్లదరూ తమకు ఆస్తులు, డబ్బులు పంచి ఇవ్వాలని కోరారు. దీంతో గొడవలు మొదలయ్యాయి. చేసేదేమీ లేక తండ్రిని హత్య చేయాలని వారు భావించారు. ఈ మేరకు జగదీష్, ఉమా మహేశ్వరి, ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న మంథని ముత్తారం మండలం దర్యాపూర్‌కు చెందిన యువకుడు గాదం రామకృష్ణలు కలిసి పట్టణంలోని చైనా బజార్చై లో రెండు కత్తులు కొనుగోలు చేశారు. పినతల్లి శారద లేని సమయం చూసి ఈనెల 22 రాత్రి జగదీష్, ఉమా మహేశ్వరి, రామకృష్ణలు కలిసి నాగభూషణంను హత్య చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో  హాజరు పరిచినట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

Holidays : జనవరి 2026 లో ఏకంగా 13 రోజులు సెలవులే.. అన్నీ లాంగ్ వీకెండ్స్..!
CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu