వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కిం రూ. 2 వేల కోట్లు కేటాయించినట్టుగా ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఏపీ అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను శుక్రవారం నాడు ప్రవేశ పెట్టారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖకు భారీగా ఏపీ సర్కార్ నిధులను కేటాయించింది. ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana Rajendranath Reddy ఇవాళ AP Assemblyలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
Niti ayog వైద్య సూచిక 2021 నివేదికలో రెండేళ్ల క్రితం ఏపీ 4వ స్థానంలో ఉందన్నారు. కానీ ప్రస్తుతం ఏపీ రాష్ట్రం 2వ స్థానానికి చేరుకుందని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.
YSR ఆరోగ్య ఆసరా పథకం కింద YS Jagan సర్కార్ రూ. 2 వేల కోట్లను కేటాయించింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన రోగులు కోలుకోనే వరకు రోజుకు రూ.225 చెల్లిస్తున్న విషయాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు.2019 డిసెంబర్ నుండి Aarogyasri శ్రీ కింద 8,83,961 కేసుల్లో శస్త్ర చికిత్సలు నిర్వహించారు. శస్త్ర చికిత్సల తర్వాత రోగులకు రూ.489.61 కోట్లు కేటాయించినట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
ఆరోగ్య శ్రీ పథకం కింద 2,09,765 మంది రోగుల చికిత్స కోసం రూ.732.16 కోట్లను ఖర్చు చేశారు.2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఆరోగ్య శ్రీ పథకానికి రూ.2 వేల కోట్లు కేటాయించినట్టుగా ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఆరోగ్య ఆసరా పథకానికి రూ. 800 కోట్లు ప్రతిపాదించినట్టుగా ఆర్ధిక మంత్రి వివరించారు.
104, 108 వాహనాల సేవల పునరుద్దరించిన విషయాన్ని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు. 104 వాహనాలను 292 నుండి 656కి పెంచామని మంత్రి తెలిపారు. మండలానికి ఒకటి చొప్పున ఈ వాహనాలున్నాయని మంత్రి చెప్పారు. మరో వైపుు 108 వాహనాలను 768కి పెంచామన్నారు మంత్రి.
గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు. సీతమ్మపేట, పార్వతీపురం, రామచంద్రాపురం, బుట్టాయిగూడెం, డోర్నాలలో ఐదు మల్లీ స్పెషాలిటీ ఆసుపత్రులను తమ ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.
పౌరుల ఆరోగ్య సంరక్షణకు 2019 కి ముందు రూ 108.25 కోట్లు నెలవారీ సగటు వ్యయం ఉంది. అయితే 2019 జూన్ తర్వాత నెలవారీ సగటు వ్యయాన్ని రూ.203.68 కోట్లకు పెంచినట్టుగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.