ఏసీబీ సోదాల ఎఫెక్ట్: దుర్గగుడి సురేష్ బాబు బదిలీకి ఏపీ సర్కార్ యోచన?

By narsimha lode  |  First Published Feb 25, 2021, 5:06 PM IST

ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఈవో సురేష్ బాబును బదిలీ  చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఇవాళో రేపో బదిలీ ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. దుర్గగుడిలో అక్రమాల విషయంలో సురేష్ బాబు ప్రమేయం ఉందనే ఆరోపణలు జోరుగా సాగుతున్న తరుణంలో  ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకొంది.



విజయవాడ: ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఈవో సురేష్ బాబును బదిలీ  చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఇవాళో రేపో బదిలీ ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. దుర్గగుడిలో అక్రమాల విషయంలో సురేష్ బాబు ప్రమేయం ఉందనే ఆరోపణలు జోరుగా సాగుతున్న తరుణంలో  ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకొంది.

గత వారంలో మూడు రోజులుగా దుర్గగుడిలో అక్రమాలపై ఏసీబీ విచారణ నిర్వహించింది. ఏసీబీ నివేదిక ఆధారంగా సుమారు 15 మందికి పైగా ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ దేవాలయంలో అక్రమాల విషయంలో ఈవో సురేష్ బాబు పాత్రపై పలు ఆరోపణలు వచ్చాయి. 

Latest Videos

undefined

తన ఆదేశాలను ఈవో పట్టించుకోలేదని దేవాదాయ శాఖ కమిషనర్ అర్జునరావు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం కూడ తెలిసిందే. గత రెండేళ్లుగా దేవాలయంలో చోటు చేసుకొన్న అక్రమాలపై ఓ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ నివేదికను ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకొంది.

తొలుత ఈవో సురేష్ బాబును దుర్గగుడి నుండి బదిలీ చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ విషయమై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. బదిలీ చేసిన తర్వాత సస్పెన్షన్ వేటు పడే అవకాశం కూడ లేకపోలేదనే ప్రచారం సాగుతోంది. 

విజయవాడ కార్పోరేషన్ ఎన్నికలను పురస్కరించుకొని దుర్గగుడిలో చోటు చేసుకొన్న అవకతవలను విపక్షాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అండతోనే ఈఓ అక్రమాలకు తెరతీశారనే ప్రచారం కూడ విపక్షాలు చేస్తున్నాయి. 
 

click me!