గుడ్ న్యూస్: ఈ నెల 8 నుండి అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు ఏపీ రెడీ

By narsimha lodeFirst Published Jun 5, 2020, 1:31 PM IST
Highlights

ఈ నెల 8వ తేదీ నుండి అంతరాష్ట్ర బస్సు సర్వీసులను నడిపేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బస్సులు తిప్పేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అనుమతులు ఇవ్వాలని పొరుగు రాష్ట్రాలను ఏపీ ప్రభుత్వం అభ్యర్ధించింది. 
 

అమరావతి: ఈ నెల 8వ తేదీ నుండి అంతరాష్ట్ర బస్సు సర్వీసులను నడిపేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బస్సులు తిప్పేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అనుమతులు ఇవ్వాలని పొరుగు రాష్ట్రాలను ఏపీ ప్రభుత్వం అభ్యర్ధించింది. 

లాక్ డౌన్ ఆంక్షల మినహాయింపులతో ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏపీ ప్రభుత్వం నడుపుతోంది. అంతరాష్ట్ర రవాణాపై కేంద్రం నిషేధం ఎత్తివేసింది. అయితే కొన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల నుండి ఆర్టీసీ బస్సులను అనుమతించడం లేదు.

దీంతో ఏపీ ప్రభుత్వం కూడ ఇతర రాష్ట్రాలకు బస్సులను నడపడం లేదు. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహనీ గురువారం నాడు లేఖ రాశారు. 

తెలంగాణ నుండి ఏపీకి వచ్చేందుకు 13 వేల మంది స్పందన వెబ్ సైట్ ద్వారా ధరఖాస్తు చేసుకొన్నారు. వీరిని బస్సుల ద్వారా రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంది. కానీ, తెలంగాణ ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన లేకపోవడంతో ఈ కార్యక్రమం అర్ధాంతరంగా వాయిదా పడింది.

ప్రైవేట్ వాహనాల నుండి పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి వచ్చే వారిని తనిఖీ చేయడం, స్క్రీనింగ్ చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో ఆర్టీసీ బస్సులను నడపాలని ప్రభుత్వం భావిస్తోంది.

తమిళనాడు మాత్రం ఇతర రాష్ట్రాల బస్సులను ఇప్పట్లో అనుమతించబోమని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ, ఒడిశా, కర్ణాటక ప్రభుత్వాలకు ఏపీ లేఖలు రాసింది. ఆయా రాష్ట్రాల నుండి అనుమతి వస్తేనే ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది.ఈ విషయమై రెండు రోజుల్లో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

click me!