గుడ్‌న్యూస్: జూన్ 11 నుండి భక్తులకు తిరుమల వెంకన్న దర్శనం

By narsimha lode  |  First Published Jun 5, 2020, 12:49 PM IST

ఈ నెల 11వ తేదీ నుండి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.


తిరుపతి: ఈ నెల 11వ తేదీ నుండి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

శుక్రవారం  నాడు మధ్యాహ్నం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 8, 9 తేదీల్లో తిరుమల ఉద్యోగులతో శ్రీవారి దర్శనాన్ని అనుమతి ఇస్తామన్నారు. ప్రతి రోజూ కూడ పరిమిత సంఖ్యలోనే భక్తులకు దర్శనాలు ఉంటాయని ఆయన ప్రకటించారు.

Latest Videos

undefined

also read:సోమ‌వారం నుంచి తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నాలు: ఘాట్ రోడ్ టైమింగ్స్ మార్పు.

ఈ నెల 10వ తేదీన తిరుపతి, తిరుమల వాసులకు శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తామని ఆయన తెలిపారు.60 ఏళ్ల పైబడిన వారితో పాటు పదేళ్లలోపు పిల్లలకు స్వామివారి దర్శనానికి అనుమతి లేదని ఆయన ప్రకటించారు.

భక్తులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకొంటామన్నారు. కంటైన్మెంట్ జోన్, రెడ్ జోన్లలో ఉన్నవారికి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వబోమని ఆయన ప్రకటించారు.

also read:లాక్‌డౌన్‌లోనూ టీటీడీకీ ఆన్‌లైన్ లో రూ. 90 లక్షల ఆదాయం

ఉదయం 6:30 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు భక్తులకు శ్రీవారి దర్శించుకొనేందుకు అనుమతి ఇస్తారు. ప్రతి రోజూ 7 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామని ఆయన తెలిపారు. 

ఆన్ లైన్ లో మూడు వేల మంది భక్తులకు అనుమతి కల్పిస్తారు. అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా మరో మూడు వేల మందికి శ్రీవారి దర్శనం కల్పించనున్నట్టుగా ఆయన చెప్పారు. 

శ్రీవారి మెట్టు నడక మార్గంలో భక్తులకు అనుమతిని నిరాకరించామన్నారు.ఘాట్ రోడ్డులో ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వాహనాలను అనుమతి ఇస్తారు. కాలినడక మార్గంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 వరకు కాలినడకన భక్తులకు అలిపిరి మార్గంలో అనుమతి ఇస్తామని కూడ ఆయన తెలిపారు.

ఈ నెల 8వ తేదీ నుండి ఏపీ వ్యాప్తంగా జిల్లాల్లో పంపిణీ చేస్తున్న స్వామి వారి లడ్డుల విక్రయాలను నిలిపివేస్తున్నామని టీటీడీ ప్రకటించింది.  కేవలం గంట పాటు మాత్రమే వీఐపీల దర్శనానికి  అనుమతి ఇస్తామని ఆయన ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల గైడ్ లైన్స్ మేరకే శ్రీవారి దర్శనాలను అనుమతి ఇస్తామని టీటీడీ తెలిపింది.అలిపిరి, జీఎన్‌సీ వద్ద భక్తుల నుండి శాంపిల్స్ సేకరించనున్నట్టుగా టీటీడీ  ఛైర్మెన్ తెలిపారు. అలిపిరి వద్ద స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా ఆయన తెలిపారు. 

 

click me!