గుడ్ న్యూస్: ఏపీలో పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా

By narsimha lode  |  First Published May 18, 2022, 5:03 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ ను సరఫరా చేయనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడిన విషయాన్ని  ప్రభుత్వం గుర్తు చేసింది.
 


అమరావతి: Andhra Pradesh రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతరాయంగా Electricity  ను సరఫరా చేయనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.  ఈ నెల 9వ తేదీ నుండి పరిశ్రమలకు Power Holiday  ను ఉపసంహరించుకుంది.  ఈ నెల 16 నుండి పరిశ్రమలకు పూర్తి స్థాయిలో విద్యుత్ ను సరపరా చేస్తామని కూడా ప్రభుత్వం తెలిపింది.దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత కారణంగా ఏపీ రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించిన విషయం తెలిసిందే.

మే 9 నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడే ఉపసంహరణ కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఈ నెల 16వ తేదీ నుంచి పరిశ్రమలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా ఇస్తున్నట్లు పేర్కొంది. 

Latest Videos

undefined

also read:ఆరు నెలల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు: జగన్ సర్కార్ నిర్ణయం

దేశవ్యాప్తంగా ఉన్న Coal కొరత వలన కొద్దిరోజుల పాటు పరిశ్రమలకు విద్యుత్ పంపిణీ లో సమస్యలు తలెత్తాయని, ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడటంతో అన్ని రంగాల వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

బొగ్గు కొరత నేపథ్యంలో  ఏపీ ప్రభుత్వం పరి:శ్రమలతో పాటు గృహావసరాలకు కూడ విద్యుత్ కోతలను విధించింది.ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అవసరాన్ని బట్టి డిస్కమ్‌లు గ్రామీణ ప్రాంతాల్లో పగటిపూట 4 గంటల వరకు కరెంటు కోతలు విధించారు. ఇక, మున్సిపల్‌ ప్రాంతాల్లో రెండు గంటలపాటు విద్యుత్‌ కోత విధించారు.  ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో కరెంట్ కోతలు విధిస్తున్నారు. అయితే ఈ పవర్ కట్స్ చెబుతున్న సమయం కన్నా ఎక్కువగానే ఉంటున్నాయి. గ్రామాలు, పట్టణాల అన్న తేడా లేకుండా ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కొన్ని సమయాల్లో రాత్రిపూట కూడా కరెంటు కోతలు విధిస్తున్నారు.

రాత్రివేళ గంటల తరబడి కరెంటు కట్​ చేయడంతో నరకయాతన అనుభవిస్తున్నామని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో షెడ్యూల్‌ లేని విద్యుత్ కోతల కారణంగా జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకొనే ప్రయత్నాలు చేశారు.  ఈ  నెల మొదటి వారంలో ఒక్క రోజు పాటు పరిశ్రమలకు పవర్ హాలిడేను ఎత్తివేశారు.

click me!