AP Government Employees: పీఆర్సీపై ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల డెడ్ లైన్..

By team teluguFirst Published Nov 13, 2021, 10:59 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు (AP Government Employees) మధ్య పీఆర్సీ(PRC) నివేదిక వ్యవహారం వివాదంగా మారుతోంది. తాజాగా  పీఆర్సీపై ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు డెడ్‌లైన్ విధించాయి. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు (AP Government Employees) మధ్య పీఆర్సీ(PRC) నివేదిక వ్యవహారం వివాదంగా మారుతోంది. కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నతాధికారులకు మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు పట్టుబట్టగా.. ఇందుకు సంబంధించి  గతంలో సీఎస్‌ ఆధ్వర్యంలో వేసిన కమిటీ అధ్యయనం చేయాల్సి ఉందని ఉన్నతాధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే 13 సంఘాల్లో 9 సంఘాల నాయకులు  జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం నుంచి బయటికొచ్చేస్తాయి. పీఆర్సీ అంశంపై ఈ సంఘాలు పోరుబాటకు సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలు కీలక ప్రకటన చేశాయి. పీఆర్సీపై ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు డెడ్‌లైన్ విధించాయి. 

ఈ నెలాఖారులోగా పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నెలఖారు వరకు ప్రభుత్వానికి సమయమిస్తున్నట్టుగా ఏపీ జేఏసీ చైర్మన్ తెలిపారు. ఈ నెల 27లోగా అన్ని సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం భవిష్యత్ కార్యచరణను రూపొందిస్తామని వెల్లడించారు. తాము దాచుకున్న డబ్బులను కూడా తమకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ నివేదికపై సీఎస్ ఇచ్చిన హామీకే విలువ లేదని అన్నారు. 

ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ నిన్న చర్చలు జరిపినట్టుగా ఏపీ జేఏసీ నేతలు వెల్లడించారు. ఉద్యోగులు, కార్మికులు కలిపి సుమారు 200 సంఘాలు ఉన్నాయని చెప్పారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శకులు కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ నెలఖారు వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సమావేశమై కార్యచరణ రూపొందిస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెమోరాండం ఇస్తామని తెలిపారు. 

ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ‘ఉద్యోగులకు ఇచ్చే ఆరోగ్య కార్డు, అనారోగ్య కార్డుగా మారింది. రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 23 కోట్ల వరకు ఉన్నాయి. వెంటనే డీఏలు ఇస్తామని మెనిఫెస్టోలో హామీ ఇచ్చారు. 7 డీఏలు పెండింగ్‌లో ఉంచారు. కాలయాపన కోసమే పీఆర్సీపై అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. పీఆర్సీ అమలు వచ్చేసరికి ప్రభుత్వం సాకులు చెబుతోంది. సీఎంవో అధికారులు, సజ్జల ఇచ్చిన హామీలు తక్షణమే తేల్చాలి. పీఆర్సీ నివేదికను ఎందుకు దాచిపెడుతున్నారు..?. హెచ్‌ఆర్‌ఏతో పాటు ఇతర అంశాలు నిర్దారణ కాకుండా ఏం మాట్లాడాలి..? మార్చిలోగా పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తామన్నారు.  ప్రభుత్వమే ఉద్యోగులను ఉద్దేశపూర్వకంగా కార్యాచరణ వైపు నెడుతోంది. హామీలు నెరవేర్చకపోతే ఉద్యమం ఖాయం. అన్ని సంఘాలతో కలిసి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తాం. డిమాండ్లు పట్టించుకోకుంటే ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పీఆర్సీ నివేదికను కోరాం.  అందులో పీఆర్సీ నివేదిక ఇవ్వలేదు.. ఆర్థిక అంశాలు పరిష్కారం కాలేదు’ అని అన్నారు.  

click me!