ఓబులాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంలో చుక్కెదురు...

By AN TeluguFirst Published Nov 13, 2021, 10:04 AM IST
Highlights

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వివాదానికి సంబంధించి సిఆర్ పిసి సెక్షన్ 173  ప్రకారం CBI తుది నివేదిక ఇచ్చేవరకు తనపై నమోదైన కేసుల విచారణను నిలిపివేయాల్సిందిగా హైదరాబాదులోని సిబిఐ ప్రిన్సిపల్ జడ్జిని ఆదేశించాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ డివై చంద్ర చూడ్,  జస్టిస్ ఏఎస్‌ బోపన్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది.

న్యూఢిల్లీ :  ఓబులాపురం మైనింగ్ కంపెనీ  Illegal mining caseలో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఏపీ పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.  కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వివాదానికి సంబంధించి సిఆర్ పిసి సెక్షన్ 173  ప్రకారం CBI తుది నివేదిక ఇచ్చేవరకు తనపై నమోదైన కేసుల విచారణను నిలిపివేయాల్సిందిగా హైదరాబాదులోని సిబిఐ ప్రిన్సిపల్ జడ్జిని ఆదేశించాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ డివై చంద్ర చూడ్,  జస్టిస్ ఏఎస్‌ బోపన్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది.

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో  ఇదే అభ్యర్థనతో  శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా ఈ సెప్టెంబర్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. గురువారం సెప్టెంబర్ 23న సీబీఐ, ఈడీ కోర్టు jagan case
పై విచారణ జరిపింది. దాల్మియా కేసులో శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. అయితే, ఈరోజు విచారణకు శ్రీలక్ష్మి, ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు గైర్హాజరయ్యారు. 

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ వారెంట్‌ను సెప్టెంబర్ 30లోగా అమలు చేయాలని ఆదేశించింది. మరోవైపు ఇదే  కేసులో సీఎం వైఎస్ జగన్‌, విజయసాయిరెడ్డి డిశ్చార్జి పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ, ఈడీ గడువు కోరాయి. పెన్నా కేసులో విశ్రాంత ఐఏఎస్‌ జి.వెంకట్రామిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. దీంతో వెంకట్రామిరెడ్డిపై ఉన్న ఎన్‌బీడబ్ల్యూను న్యాయస్థానం రీకాల్‌ చేసింది. 

వాన్‌పిక్‌ కేసులో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి బ్రహ్మానందరెడ్డి ఈరోజు విచారణకు హాజరు కాలేదు. వీరిద్దరికీ గతంలో హైకోర్టు మినహాయింపు ఇచ్చినప్పటికీ వారు కానీ, వారి తరఫు న్యాయవాదులు కచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది. మోపిదేవి, బ్రహ్మానందరెడ్డి లాయర్లు గైర్హాజరైతే తగిన ఉత్తర్వులిస్తామని కోర్టు స్పష్టం చేసింది.  

Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో దారుణం.. ఆస్పత్రికి వచ్చిన యువతితో టెక్నీషియన్ అసభ్య ప్రవర్తన..

అంతకు ముందు జూలై, 2021లో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది. ఓఎంసీ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని రాతపూర్వకంగా సీబీఐ కోర్టులో మెమోలు దాఖలు చేయాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు జూలై 9, శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు ఈ కేసులో నిందుతురాలైన ఏపీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐ కోర్టును ఆదేశించింది.

తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. అనంతపురం జిల్లా డీ. హీరేహాళ్ మండలం ఓబుళాపురం గనుల సరిహద్దుల వివాదంపై దర్యాప్తు పూర్తయ్యేవరకు సీబీఐ కోర్టులో విచారణను నిలిపివేయాలంటూ ఐఏఎస్ అధకారి శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ షమీమ్ అక్తర్  మరోసారి విచారణ చేపట్టి ఈ ఉత్తర్వులిచ్చారు.

జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ED నమోదు చేసిన కేసుల్లో విచారణను CBI court ఈ నెల 16వ తేదీకీ వాయిదా వేసింది. అరబిందో, హెటిరో, పెన్నా, రాంకీ, జగతి పబ్లికేషన్స్, ఇందూ టెకోజోన్, ఇండియా సిమెంట్స్ కేసులు విచారణకు వచ్చాయి. సీబీఐ కేసు తర్వాత వీటి విచారణ చేపట్టాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో విచారణ వాయిదా పడింది. 

click me!