Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో దారుణం.. ఆస్పత్రికి వచ్చిన యువతితో టెక్నీషియన్ అసభ్య ప్రవర్తన..

Published : Nov 13, 2021, 09:58 AM ISTUpdated : Nov 13, 2021, 11:19 AM IST
Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో దారుణం.. ఆస్పత్రికి వచ్చిన యువతితో టెక్నీషియన్ అసభ్య ప్రవర్తన..

సారాంశం

గుంటూరులోని(Guntur)  జీజీహెచ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రికి వచ్చిన యువతి పట్ల టెక్నీషియన్ అసభ్యంగా ప్రవర్తించాడు. 

గుంటూరులోని(Guntur)  జీజీహెచ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రికి వచ్చిన యువతి పట్ల టెక్నీషియన్ అసభ్యంగా ప్రవర్తించాడు. యువతి దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. యువతి ఈసీజీ కోసం జీజీహెచ్‌కు (GGH) వచ్చిన సమయంలో టెక్నీషియన్‌ అసభ్యకరంగా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది. దీంతో యువతి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. యువతి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. 

కొద్ది రోజుల క్రితమే బాలిక కిడ్నాప్.. వార్డు బాయ్‌ అరెస్ట్..
 గత నెలలో గుంటూరు జీజీహెచ్‌లో మూడు రోజుల పసికందు కిడ్నాప్‌కు గురికావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే కొద్ది గంటల్లోనే పోలీసులు ఈ కేసును చేధించారు. గుంటూరులోని నెహ్రూనగర్లో బాలుడి ఆచూకీ గుర్తించిన పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. సీసీటీవీ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా పనిచేసే వ్యక్తే ఈ నేరానికి పాల్పడినట్టుగా గుర్తించారు. పసికందును ఎత్తుకెళ్లడానికి అతనికి మరో మహిళ సహకరించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆస్పత్రిలో పనిచేసే వ్యక్తే ఇలాంటి దారుణానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్