చంద్రబాబులో అపరిచితుడు ఉన్నాడేమో: సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్

By Siva KodatiFirst Published Jan 21, 2021, 2:46 PM IST
Highlights

చంద్రబాబు ఇవాళ చాలా ఆవేశంగా మాట్లాడారని ఎద్దేవా చేశారు వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. దబాయింపు ధోరణిలో చంద్రబాబు తీరు వుందని ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు ఇవాళ చాలా ఆవేశంగా మాట్లాడారని ఎద్దేవా చేశారు వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. దబాయింపు ధోరణిలో చంద్రబాబు తీరు వుందని ఎద్దేవా చేశారు.

డీజీపీని ఉద్దేశించి ప్రతిపక్షనేత అనుచిత వ్యాఖ్యలు చేశారని సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు శాడిజం ఏంటో అర్ధం కావడం లేదని రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. దేవుడి విగ్రహం గురించి కూడా చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన వ్యాఖ్యానించారు.

సీఎం జగన్‌ను టార్గెట్ చేయడమే చంద్రబాబు లక్ష్యమని సజ్జల మండిపడ్డారు. హైదరాబాద్ నగరాన్ని నేనే కట్టా, సెల్‌ఫోన్‌లు నేనే తీసుకొచ్చాను అనే చంద్రబాబుకు ఎనీ వేర్ బ్యాంకింగ్ సంగతి తెలియదా అని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

దీని వెనుక ఓ పన్నాగం కనిపిస్తోందన్న ఆయన... పాతవన్నీ తీసీ ఈ రోజు పోగేస్తున్నారు. మతాన్ని రెచ్చగొట్టి జనం నుంచి సానుభూతి సంపాదించాలని చంద్రబాబు కుట్రపన్నారని సజ్జల విమర్శించారు.

ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా నాటి ప్రతిపక్షనేతగా వున్న జగన్మోహన్ రెడ్డి విశాఖ వెళ్తే మీరేం చేశారని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశ్యంతో జగన్ విశాఖకు వెళ్లలేదని.. రాష్ట్రానికి ప్రాణ ప్రదమైన అంశం గురించి అక్కడికి వెళ్లాలేరని సజ్జల చెప్పారు.

కనీసం లోపలికి రానీయకుండా రన్‌వేపైనే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్నారని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల విషయంలో టీడీపీ ప్రభుత్వం ఎలా ప్రవర్తించిందనేది తామింకా మరిచిపోలేదని చెప్పారు.

చంద్రబాబులో అపరిచితుడు ఉన్నాడేమో అనిపిస్తోందంటూ సజ్జల సెటైర్లు వేశాడు. ఎవరికైనా హాని జరిగిందని తెలిసినప్పుడు ప్రతి ఒక్కరూ సానుభూతితో మాట్లాడాతారని సజ్జల వెల్లడించారు.

ఎంపీ విజయసాయిరెడ్డిపై దాడి జరిగిందన్నది వాస్తవమన్న ఆయన... కళా వెంకట్రావ్ పాత్రపై ప్రశ్నించేందుకే పోలీసులు పిలిచారు. ప్రవీణ్ చక్రవర్తి మీద చంద్రబాబు హయాంలోనే ఓ మహిళ కేసు పెట్టిందని సజ్జల గుర్తు చేశారు. చంద్రబాబు మాటలకు జనం నవ్వుతున్నారని రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. 

click me!