బాబుకి షాక్: గత ప్రభుత్వ నిర్ణయాలపై సీబీఐ విచారణకు ఏపీ కేబినెట్ నిర్ణయం

By narsimha lodeFirst Published Jun 11, 2020, 2:09 PM IST
Highlights

చంద్రబాబు ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరపాలని ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకొంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం గురువారంనాడు జరిగింది.


అమరావతి:చంద్రబాబు ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరపాలని ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకొంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం గురువారంనాడు జరిగింది.

గత ప్రభుత్వ హయంలో అవకతవకలపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికను సీఎం జగన్ కు అందించారు.ఫైబర్ నెట్, రంజాన్ తోఫా, చంద్రన్న కానుకలపై సీబీఐ విచారణ కోరాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. 

also read:ప్రారంభమైన ఏపీ కేబినెట్:నిమ్మగడ్డ సహా పలు కీలకాంశాలపై చర్చ

 భోగాపురం ఎయిర్ పోర్టు, రామాయపట్నం పోర్టు నిర్మాణాలకు కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్ .రామాయపట్నం పోర్టుకు కేంద్రం నిధులపై కేబినెట్ లో చర్చించారు. విభజన హామీల్లో భాగంగా రామాయపట్నం పోర్టుకు  నిధులు ఇవ్వాల్సి ఉంటుందని కేబినెట్ లో చర్చ జరిగింది.

కేంద్రం నుండి ఈ పోర్టు నిర్మాణానికి నిధుల కోసం ప్రయత్నాలు చేస్తూనే ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారు.ఐదు దశల్లో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఆగష్టు నాటికి టెండర్లు పిలవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

రామాయపట్నం పోర్టు టెండర్లను జ్యూడిషీయల్ ప్రివ్యూకు పంపాలని జగన్ ఆదేశించారు. వైఎస్ఆర్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో రూ. 50 వేల ఆర్ధిక సహాయం అందించాలని నిర్ణయించారు.ఆగష్టు 12న వైఎస్ఆర్ చేయూత పథకాన్ని జగన్ ప్రారంభించనున్నారు.

click me!