ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల విషయమై ఈ నెలాఖరునాటికి తేలనుంది. ఈ నెల 17న ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తుది సమావేశం జరగనుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Cinema టికెట్ల ధరల పెంపు అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 17న సమావేశం కానుంది.ఈ సమావేశమే చివరి సమావేశంగా చెబుతున్నారు. రాష్ట్రం మొత్తం ఒకే తరహ ధరలు ఉండేలా ప్రభుత్వం భావిస్తుంది.ఇప్పటికే సినిమా టికెట్ల అంశానికి సంబంధించి Cine పరిశ్రమకు చెందిన ప్రముఖులతో ఏపీ సీఎం YS Jagan గురువారం నాడు ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. దీంతో సినిమా Ticket ధరల విషయమై ఈ కమిటీ సిఫారసులను చేయనుంది.
గురువారం నాడు Chiranjeevi నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం జగన్ తో భేటీ అయింది. ఈ సమావేశంలో జగన్ సినీ ప్రముఖులకు ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు.ఏ హీరో సినిమానైనా, ఏ సినిమానైనా ఒక్కటే రకంగా సినిమా టికెట్ ధర ఉండాలని సీఎం జగన్ తేల్చి చెప్పారు. పండుగల సమయాల్లో చిన్న సినిమాలకు థియేటర్లు దక్కేలా కూడా చూడాలని కూడా సీఎం జగన్ సినీ ప్రముఖులను కోరారు. ప్రస్తుతం ఇచ్చిన జీవో 35లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. సినీ ప్రముఖులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుండి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకొని టికెట్లపై సిఫారసులను చేయనుంది. అయితే భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రం వారం రోజుల పాటు ప్రత్యేక ధరలు ఉండనున్నాయి. రూ. 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలకు వారం రోజుల పాటు ప్రత్యేకంగా ధరలతో టికెట్లను విక్రయించుకొనే వెసులుబాటును కల్పించే అవకాశం ఉంది.
సినిమా టికెట్ల ధరలపై ఈ నెల 17న ప్రభుత్వ కమిటీ భేటీ కానుంది. సభ్యులకు ఉన్నతాధికారులు కమిటీ సమాచారం పంపారు. భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. హీరోలు చేసిన సిఫార్సులపై కమిటీ భేటీలో చర్చించనున్నారు. టికెట్ ధరలు, అదనపు షోలు, భారీ బడ్జెట్ చిత్రాలు వంటి అంశాలపై చర్చ జరగనుంది.నిన్న సీఎంతో జరిగిన సమావేశంలో సినీ రంగ సమస్యలకు శుభం కార్డు పడిందని భావిస్తున్నానని చిరంజీవి చెప్పారు.ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం జీవోలు జారీ చేసే అవకాశం ఉందని చిరంజీవి తెలిపారు.
సినిమా టికెట్ల ధరలపై గందర గోళ పరిస్థితులు కూడా తొలగిపోయే అవకాశం ఉందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఈ విషయ,మై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చిరంజీవి చెప్పారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రతిపాదలను కమిటీ క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదికను ఇవ్వనుంది. అన్ని రకాల సినీ రంగ సమస్యలకు ప్రభుత్వం చెక్ పెట్టాలని భావిస్తుంది. ఈ విషయమై సినీ ప్రముఖులతో చర్చించారు.సినీ ప్రముఖులు కూడా జగన్ తో జరిగిన చర్చల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.
చిన్న సినిమాలు ఐదవ షోకి కూడా ప్రభుత్వం అంగీకరించిందని చిరంజీవి చెప్పారు. ప్రజలు, సినీ పరిశ్రమ కూడా సీఎం జగన్ తీసుకొన్న నిర్ణయం పట్ల సంతృప్తి చెందుతారని చిరంజీవి అభిప్రాయపడ్డారు. సినిమా టికెట్ ధరలపై కొన్ని నెలలుగా ఉన్న అనిశ్చిత పరిస్థితులకు శుభం కార్డు పడిందని చెప్పడానికి తాను సంతోషిస్తున్నానని చిరంజీవి చెప్పారు. చిన్న సినిమాలకు కూడా మేలు చేకూరేలా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. చర్చలకు మమ్మల్ని ఆహ్వానించిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు