సీఐడీ నోటీసులు ఇస్తే చంద్రబాబు ఎందుకింత భయపడుతున్నారని ఏపీ ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు.
అమరావతి: సీఐడీ నోటీసులు ఇస్తే చంద్రబాబు ఎందుకింత భయపడుతున్నారని ఏపీ ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు.
మంగళవారం నాడు అమరావతిలో ఏపీ ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు ఇప్పటికైనా తన తప్పును తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు.
చంద్రబాబుకు 'స్టే'ల బాబుకు పేరుందని ఆయన ఎద్దేవా చేశారు. కోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందని లోకేష్ మాట్లాడుతున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కోర్టుల్లో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తే స్టేలు తెచ్చుకోకుండా ఉండాలని ఆయన సూచించారు.ఈ విషయమై చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే విచారణకు సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమ పార్టీ ప్రజా ప్రతినిధులను ఇబ్బందులకు గురి చేశారని ఆయన చెప్పారు. అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ విషయమై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చింది.