చంద్రబాబు గడ్డంలోని మెరిసిన వెంట్రుక కూడా పీకలేరు...: లోకేష్ సీరియస్

Published : Mar 16, 2021, 01:51 PM IST
చంద్రబాబు గడ్డంలోని మెరిసిన వెంట్రుక కూడా పీకలేరు...: లోకేష్ సీరియస్

సారాంశం

మాజీ సీఎం చంద్రబాబుకు సీఐడి నోటీసులు జారీ చేయడం, కేసులు పెట్టడంపై స్పందించిన నారా లోకేష్ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. 

అమరావతి: రాజధాని భూముల వ్యవహారంలో సీఐడి అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో ఈ నెల 23వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయగా ఇందులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కూడా ఓ కేసు నమోదైంది. ఈ నోటీసులు, కేసులపై స్పందించిన నారా లోకేష్ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. 

''తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని నమ్మించడానికి సీఎం వైఎస్ జగన్ పడుతున్న తిప్పలు చూస్తుంటే నవ్వొస్తుంది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేక సార్లు చీవాట్లు పెట్టినా పాత పాటే ఎన్నాళ్లు?" అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికన ప్రశ్నించారు. 

read more  చంద్రబాబు ప్రాణాలపై ఆందోళన... కుట్రలో భాగంగానే...: బుద్దా సంచలనం

''21నెలలు శోధించి అలసిపోయి ఆఖరికి రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సి, ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారు. సిల్లీ కేసులతో చంద్రబాబు గారి గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరు. అమరావతిని అంతం చెయ్యడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, దైవభూమి తనని తానే కాపాడుకుంటుంది'' అని లోకేష్ హెచ్చరించారు. 

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు