టీటీడీ ఛైర్మెన్ గా మరోసారి వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది జూన్ 22 వతేదీన ఆయన టర్మ్ పూర్తైంది. దీంతో ఇవాళ ఆయనను మరోసారి ఛైర్మెన్ గా నియమించింది ఏపీ ప్రభుత్వం.
అమరావతి: టీటీడీ ఛైర్మెన్ గా మరోసారి వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నియమించింది.ఈ మేరకు ఆదివారం నాడు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర పాలకవర్గ సభ్యులను త్వరలోనే నియమించనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలిసారిగా టీటీడీ ఛైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించింది ప్రభుత్వం. ఇటీవలనే టీటీడీ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. దీంతో మరోసారి టీటీడీ ఛైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డి ప్రఃభుత్వం నియమించింది.
ఈ ఏడాది జూన్ 22వ తేదీన వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగిసింది. దీంతో కొత్త ఛైర్మెన్ గా సుబ్బారెడ్డిని నియమించింది ప్రభుత్వం.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రేండేళ్ల పాటు వైవీ సుబ్బారెడ్డి ఛైర్మెన్ గా కొనసాగారు. మరోసారి ఆయనకు ఈ పదవిని జగన్ సర్కార్ కట్టబెట్టింది.2019 జూన్ 22న ఆయన తొలిసారిగా ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన మూడు మాసాల తర్వాత బోర్డులో 37 మంది సభ్యులను నియమించారు. మరో దఫా వైవీ సుబ్బారెడ్డిని ఛైర్మెన్ గా నియమించారు. నాలుగైదు రోజుల్లో కొత్త సభ్యులను నియమించే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. రెండు మూడు రోజుల్లో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మెన్ గా ప్రమాణం చేసే అవకాశం ఉంది.