తుళ్లూరులో ఉద్రిక్తత... హైకోర్టు వైపు పరుగుతీసిన మహిళలు (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 8, 2021, 12:02 PM IST
Highlights

రాజధాని అమరావతి గ్రామాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అమరావతి రైతులు మహా నిరసన ర్యాలీ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాజధాని వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. 

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం 600వ రోజుకు చేరుకున్న సందర్భంగా రైతులు, మహిళలు భారీ ర్యాలీకి ప్రయత్నిస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ర్యాలీకి   పోలీసులు అనుమతి ఇవ్వకున్నా ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరాలని రైతులు, మహిళలు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే రాజధాని ప్రాంతంలో భారీ పోలీసులను మోహరించి నిరసనకారులను అడ్డుకుంటున్నారు. 

రాజధాని గ్రామమైన తుళ్లూరులో రైతు శిబిరం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ  శిబిరం నుండి బైక్ ర్యాలీకి ప్రయత్నించగా ముళ్లకంచెలు వేసి అడ్డుకున్నారు పోలీసులు. బైక్ ర్యాలీని ఆపడానికి పోలీసులంతా వెళ్లగా ఇదే అదనుగా మరోవైపునుండి హైకోర్టు వైపు పరుగులు తీశారు మహిళలు. దీంతో ఏం చేయాలో కొందరు పోలీసులు మహిళల వెంట పరుగుపెట్టారు. 

వీడియో

రాజధాని అమరావతి లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అమరావతి ఉద్యమం 600వ రోజుకు చేరుకున్న సందర్భంగా రైతులు, మహిళలు రాష్ట్ర హైకోర్టు ప్రాంగణం నుంచి మంగళగిరి లక్ష్మినరసింహ స్వామి దేవాలయం వరకు న్యాయస్థానం-దేవస్థానం పేరిట ర్యాలీకి సిద్దమయ్యారు. అయితే ఈ నిరసన ర్యాలీకి అనుమతించని పోలీసులు అడ్డుకునేందుకు రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరించారు. 29 గ్రామాల్లో 3 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటుచేశారు. 

read more  రాజధాని రైతులు, మహిళల మహా నిరసన ర్యాలీ... అమరావతిలో టెన్షన్ టెన్షన్ (వీడియో)

కరోనా కారణంగా 50 మందికి మించి చేసే కార్యక్రమాలకు ఎటువంటి అనుమతులు లేవు అంటూ పోలీసులు ఉదయం నుంచి జేఏసీ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది జేఏసి  నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు జంగాల సాంబశివరావు అమరావతి ఉద్యమానికి మద్దతుగా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరగా గేటు సెంటర్ వద్దకు రాగానే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి మంగలగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మరోవైపు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఆలయం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేసి భక్తులను కూడా అనుమతించడం లేదు. ఇలా అడుగడుగనా పోలీస్ పహారా ఏర్పాటుచేయడంతో టెన్షన్ వాతావరణ నెలకొంది. 

click me!