AP Budget 202324లో వ్యవసాయానికి పెద్దపీట: రూ. 11589.48 కోట్లు కేటాయింపు

By narsimha lode  |  First Published Mar 16, 2023, 10:52 AM IST

రాష్ట్ర ప్రభుత్వం  బడ్జెట్ లో  భారీ కేటాయింపులు  చేసింది.  బడ్జెట్ లో  వ్యవసాయానికి  11589.48 కోట్లు  కేటాయించింది.
 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారంనాడు  ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో  వ్యవసాయానికి  పెద్దపీట  వేసింది.  వ్యవసాయానికి బడ్జెట్ లో   రూ.11589.48 కోట్లు  కేటాయించింది.
 మత్స్యకారులకు డీజీల్  సబ్సిడీ  రూ. 50 కోట్లు  కేటాయించారు.  రైతు కుటుంబాల పరిహారం కోసం  రూ. 20 కోట్లు కేటాయించారు. వ్యవసాయ యాంత్రీకరణకు  రూ. 1212  కోట్లు కేటాయించింది  ప్రభుత్వం.

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి  పెద్ద పీట  వేసింది.  రైతుల సంక్షేమం కోసం  ప్రభుత్వం  పలు పథకాలను తీసుకు వచ్చింది.  ప్రకృతి వైపరీత్యాలు  సంభవిస్తే  రైతులకు  ఇన్ పుట్ సబ్సిడీని  అదే  ఏడాది  అందిస్తున్నారు.  మరో వైపు   రాష్ట్ర వ్యాప్తంగా  ఏర్పాటు  చేసిన  ఆర్ బీ కే లతో  రైతులకు  సహాయ సహకారాలు అందిస్తున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం  ప్రవేశ పెట్టిన ఆర్ బీ కేలను  పలు రాష్ట్రాల ప్రతినిధులు  పరిశీలించిన విషయం తెలిసిందే. మరో వైపు  ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి  చేయాలని  రాష్ట్ర ప్రభుత్వం  భావిస్తుంది.  
 

Latest Videos

click me!