మాజీ మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట: ఏపీ హైకోర్టు ఆర్డర్ పై స్టే

By narsimha lodeFirst Published Jan 6, 2023, 1:41 PM IST
Highlights

మాజీ మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో  ఊరట లభించింది.  ఏపీ హైకోర్టు ఆర్డర్  పై  సుప్రీంకోర్టు  స్టే విధించింది.  

అమరావతి: మాజీ మంత్రి నారాయణకు మ సుప్రీంకోర్టులో  ఊరట లభించింది.  టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో  ఏపీ హైకోర్టు ఆర్డర్ పై  సుప్రీంకోర్టు శుక్రవారంనాడు స్టే ఇచ్చింది.మాజీ మంత్రి నారాయణ తరపున  సుప్రీంకోర్టులో  సీనియర్ కౌన్సిల్  సిద్దార్ద్ లూద్రా,  గంటూరు ప్రమోద్,  గుంటూరు ప్రేరణలు వాదించారు. ఈ విషయమై ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది  సుప్రీంకోర్టు. నాలుగు వారాల్లో  ఈ విషయమై  సమాధానం ఇవ్వాలని  కూడా  సుప్రీంకోర్టు ఆదేశించింది. 

గత ఏడాది ఏప్రిల్  27న చిత్తూరు జిల్లా గంగాధర  నెల్లూర మండలం నెల్లేపల్లిలోని జిల్లా పరిషత్  హై స్కూల్ లో తెలుగు  ప్రశ్నాపత్రం లీకైంది. ఈ కేసులో  నారాయణ విద్యాసంస్థల పాత్ర ఉందని చిత్తూరు పోలీసులు అరెస్ట్  చేశారు.  నారాయణ విద్యాసంస్థలకు  తనకు సంబంధం లేదని మాజీ మంత్రి నారాయణ  ప్రకటించారు. 2014లోనే తాను నారాయణ విద్యా సంస్థలకు  రాజీనామా చేసినట్టుగా   నారాయణ  ప్రకటించారు. పక్కా పథకం ప్రకారంగానే  ప్రశ్నపత్రం లీకైందని  పోలీసులు అప్పట్లో  ప్రకటించారు.ఈ  కేసులో  హైద్రాబాద్ లో మాజీ  మంత్రి నారాయణను  చిత్తూరు పోలీసులు అరెస్ట్  చేశారు.  

ఈ కేసులో  మాజీ మంత్రి నారాయణకు  గత ఏడాది మే  11న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయమై పోలీసులు చిత్తూరు  సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.  చిత్తూరు సెషన్స్ కోర్టు  నారాయణ బెయిల్ ను రద్దు  చేసింది. ఈ ఆదేశాలపై  హైకోర్టులో సవాల్ చేశారు మాజీ మంత్రి నారాయణ.గత ఏడాది నవంబర్  30 లోపుగా  లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ  నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలపై  సుప్రీంకోర్టులో నారాయణ సవాల్  చేశారు.  ఈ విషయమై హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు  స్టే ఇచ్చిందని  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 
 

click me!