డైవర్షన్ రాజకీయంలో భాగంగానే గన్నవరంలో ఘర్షణలు: టీడీపీపై సజ్జల ఫైర్

By narsimha lodeFirst Published Feb 22, 2023, 5:17 PM IST
Highlights

గన్నవరంలో  టీడీపీ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా   గొడవలు చేశారని  ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి  విమర్శించారు.  
 

అమరావతి: తమ ప్రభుత్వం,  పార్టీ ఎప్పుడు మంచి పని  చేసినా దాన్ని అడ్డుకునే  టీడీపీ కుట్ర చేస్తుందని  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ  సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.బుధవారం నాడు  తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో  ఆయన మీడియాతో  మాట్లాడారు.  రాష్ట్రంలో  ఏదో జరిగిపోతున్నట్టుగా తప్పుడు ప్రచారం  చేస్తున్నారని  చెప్పారు.బీసీలకు తమ పార్టీ ఎమ్మెల్సీ పదవులను కట్టబెట్టిన అంశం  ప్రచారం కాకుండా డైవర్షన్ రాజకీయం చేసిందని  సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.  గత మూడేళ్లుగా  వైసీపీని ఎదుర్కొనలేక  దొడ్డిదారి రాజకీయాలకు టీడీపీ శ్రీకారం చుట్టిందని  ఆయన  విమర్శించారు.  

విజయవాడ నుండి గన్నవరం ప్రాంతానికి  పట్టాభి  ఎందకు  పోయారని  ప్రశ్నించారు. గన్నవరం ఎమ్మెల్యే  వల్లభనేని వంశీపై  పట్టాభి తీవ్ర విమర్శలు చేశారన్నారు.  అయినా  కూడా వంశీ  సంయమనంతో  ఉన్నారని  సజ్జల రామకృష్ణారెడ్డి  గుర్తు  చేశారు.  

 గన్నవరంలో  టీడీపీ నేతలు గొడవలు సృష్టించారని  సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.  బూతులు తిట్టడంలో  పరీక్ష పెడితే  పట్టాభికి  డిస్టింక్షన్ వస్తుందని  సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు. పట్టాభికి  బూతులు నేర్పించి  ఒక ఆంబోతులా ప్రజల మీదికి వదిలారని  సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. బూతులు తిడుతూ  అధికారులపై దాడులు  చేస్తే  కేసులు పెట్టొద్దా అని  ఆయన ప్రశ్నించారు.  చంద్రబాబు ఎప్పుడూ  స్వంతంగా  అధికారంలోకి వచ్చింది లేదని  సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు. ఎప్పుడూ ఎవరో  ఒకరి మద్దతుతోనే  చంద్రబాబు విజయం సాధించారన్నారు.  వ్యవస్థలు మేనేజ్ చేయడమే చంద్రబాబు పని అని ఆయన   పేర్కొన్నారుచంద్రబాబునాయుడు అధికారంలో  ఉన్న సమయంలో  తమ పార్టీ నేతలను ఎలా వేధించారో  అందరికీ తెలుసునని చెప్పారు.  

గన్నవరం ఘటన లో  ఓ వర్గం మీడియా ఉద్దేశ్యపూర్వకంగా  ప్రభుత్వంపై తప్పుడు  ప్రచారం  చేస్తుందని  సజ్జల రామకృష్ణారెడ్డి   విమర్శించారు. తప్పుడు  ప్రచారం  చేస్తున్న  ఎల్లో మీడియాను  బహిష్కరించాలా లేదా  అని  ఆయన ప్రశ్నించారు. సాక్షి  ప్రారంభమైన తర్వాతే  ఓ వర్గం  మీడియా అరాచకాలకు  అడ్డుకట్ట వేసినట్టుగా  సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.    ప్రజలను  తప్పుదారి పట్టించేందుకు  ఎల్లో  మీడియా తప్పుడు  ప్రచారం  చేసిందని  ఆయన  విమర్శించారు. తప్పుడు  సమాచారం  ఇస్తున్న  ఎల్లో మీడియాను ప్రజలు స్వచ్ఛంధంగా బహిష్కరించాలని  ఆయచ కోరారు

అబద్దాలు  ఎలా చెప్పాలో  టీడీపీ నేత చెంగల్రాయుడు   పార్టీ  శిక్షణ తరగతుల్లోనే మాట్లాడారని  సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు. ఈ మేరకు  చెంగల్రాయుడు  ప్రసంగం  వీడియోను  సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో  ప్రదర్శించారు.  

also read:ఎన్నికల టైంలో వేషగాళ్లు దిగుతున్నారు.. చంద్రబాబు ఆ విషయంలో దిట్ట : సజ్జల వ్యాఖ్యలు

రౌడీలు, అబద్దాలకోరులతో  చంద్రబాబునాయుడు  జన్మభూమి కమిటీలు ఏర్పాటు  చేశారని  ఆయన విమర్శించారు. వ్యక్తిత్వ హననం  చేయడమే చంద్రబాబు  పని అని  సజ్జల రామకృష్ణారెడ్డి  విమర్శించారు.  కందుకూరు, గుంటూరులలో   సామాన్యులు చనిపోవడానికి కారణమైనందున  రాష్ట్ర ప్రభుత్వం  జీవో నెంబర్ 1ని  తీసుకు రావాల్సి వచ్చిందని  సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు.2014-19 లలో  వ్యవస్థలను దుర్వినియోగం  చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. 


 

click me!