చంద్రబాబును హైదరాబాద్ నుంచి తరిమికొడతారు.. టీడీపీ వాళ్లకు నోరులేస్తే చేతులతో సమాధానం: మంత్రి రోజా

Published : Feb 22, 2023, 04:33 PM IST
చంద్రబాబును హైదరాబాద్ నుంచి తరిమికొడతారు.. టీడీపీ వాళ్లకు నోరులేస్తే చేతులతో సమాధానం: మంత్రి రోజా

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు  నాయుడుపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. చంద్రబాబును, టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి  లేదన్నారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు  నాయుడుపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. గన్నవరంలో చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించిన రోజా.. వైసీపీ గుండాలు అంటూ టీడీపీ నేతలు మాట్లాడటాన్ని తప్పుబట్టారు. దౌర్జన్యం, గూండాయిజం అనేది  టీడీపీ హయాంలో జరిగిందని విమర్శించారు. దౌర్జన్యం, గూండాయిజం, సైకోయిజానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు, టీడీపీ నేతలే అని ఏపీ మంత్రి రోజా ఆరోపించారు. చంద్రబాబును, టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి  లేదన్నారు. 

గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని.. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు తన వద్ద ఉన్న సైకోలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో టీడీపీకి అడ్రస్ లేకుండా చేస్తే.. చంద్రబాబు ఆంధ్రలో నుంచి పారిపోయి హైదరాబాద్‌లో ఉన్నారని విమర్వించారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబును హైదరాబాద్ నుంచి తరిమి కొడతారని అన్నారు. సీఎం జగన్ మంచి పని చేసినప్పుడల్లా ఆయనకు క్రెడిట్ రాకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు డైవర్షన్‌ పాలిటిక్స్ ఎలా  చేస్తారనే విషయం ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. 

ఈజ్ ఆఫ్ డూయింగ్, గ్రోత్ రేట్‌ విషయంలో దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలిపారని చెప్పారు. సీఎం జగన్ 18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే.. అందులో 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారేనని అన్నారు. దీనిని చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెచ్చుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోకుండా.. తనకున్న సమయంలో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో సీఎం జగన్ ముందుకు సాగుతున్నారని చెప్పారు. టీడీపీ రౌడీయిజం చేష్టలను, మాటలను చూసి ప్రజలు, కార్యకర్తలు విసిగిపోయారని అన్నారు. వాటిని ఇకమీద సహించేది లేదని హెచ్చరించారు. టీడీపీ వాళ్లకు నోరులేస్తే తమ కార్యకర్తలు చేతులతో సమాధానం చెబుతారని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్