పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

Published : Feb 22, 2023, 03:52 PM ISTUpdated : Feb 22, 2023, 05:36 PM IST
పార్వతీపురం  మన్యం జిల్లాలో  రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

సారాంశం

పార్వతీపురం మన్యం జిల్లాలో  ఇవాళ  జరిగిన  రోడ్డుప్రమాదంలో  ఆరుగురు మృతి చెందారు.  మరో  ఇద్దరు గాయపడ్డారు. 

విజయనగరం: పార్వతీపురం  మన్యం జిల్లాలో  బుధవారం నాడు ఘోర ప్రమాదం  చోటు  చేసుకుంది.  కొమరాడ వద్ద ఆటో, లారీని ఢీకొన్న ఘటనలో ఆరుగరు మృతి చెందారు.  ఈ ఘటనలో  మరో ఇద్దరు గాయపడ్డారు. పెళ్లికి వెళ్లి  తిరిగి  వస్తున్న  సమయంలో  కొమరాడ  మండలం చొల్లవరం వద్ద ఈ ప్రమాదం జరిగింది.  

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో  ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఇవాళ  మహరాష్ట్ర పుణెలో  జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఒకే కుటుంబానికి చెందిన నలుుగురు మృతి చెందారు. 

మేఘాలయలో  నార్త్ గారో హిల్స్ లో ఈ నెల  21న జరిగిన  రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ నెల  19న తెలంగాణలోని  జోగులాంబ గద్వాల జిల్లాలో  జరిగిన రోడ్డు ప్రమాదంలో  ముగ్గురు మృతి చెందారు. జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని తిరిగివెళ్తున్న సమయంలో  ఈ ప్రమాదం  జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 

ఈ నెల  16 వ తేదీన చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఆటో, బస్సు ఢీకొన్న ప్రమాదంలో  ముగ్గురు మృతి చెందారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  శ్రీకాకుళంలో  ఈ నెల  14న విషాదం చోటు  చేసుకుంది.   శ్రీకాకుళం జిల్లాలో  పెళ్లైన  మూడు రోజులకే  నవదంపతులు  మృతి చెందారు. 

PREV
click me!

Recommended Stories

YS Sharmila Comments on Modi: గాడ్సే, మోదీ ఇద్దరూ ఒకటే షర్మిల సంచలన కామెంట్స్| Asianet News Telugu
CM Chandrababu Naidu Speech: కర్నూలు జిల్లాలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu