కేబినెట్ కూర్పు విషయమై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. కేబినెట్ విషయమై మార్పులు చేర్పుల విషయమై చర్చిస్తున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి YS Jagan తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy, సీఎంఓ అధికారులు ఆదివారం నాడు భేటీ అయ్యారు.మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణకు సంబంధించి సీఎం జగన్ చర్చిస్తున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత రాజ్ భవన్ కి కొత్త మంత్రుల జాబితాను ప్రభుత్వం పంపనున్నారు. గత మంత్రివర్గం నుండి 10 మందికి చాన్స్ దక్కే అవకాశం ఉంది. అయితే కొత్తగా 25 మందికి అవకాశం కల్పించనున్నారు.
మంత్రి వర్గ కూర్పుకు సంబంధించి సామాజిక సమీకరణాలు, ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితులపై కూడా చర్చిస్తున్నారు. ఈ మేరకు కేబినెట్ లో చోటు దక్కనుంది. అయితే Cabinetలో చోటు దక్కుతుందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద వారి అభిమానులు సందడి చేస్తున్నారు.
undefined
విశాఖపట్టణం జిల్లాలో గుడివాడ అమర్ నాథ్ కు కేబినెట్ లో చోటు దక్కిందనే ప్రచారంతో ఆయన అభిమానులు అమర్ నాథ్ ఇంటి వద్ద అభిమానులు సందడి చేశారు. అయితే తనకు ఇంకా అధికారికంగా సమాచారం రాలేదని అమర్ నాథ్ చెప్పారు. సీఎం ఏ బాధ్యత అప్పగించినా కూడా తాను క్రమశిక్షణగా నిర్వహిస్తానని అమర్ నాథ్ చెప్పారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి కేబినెట్ లో బెర్త్ దక్కిందనే ప్రచారం కావడంతో గోవర్ధన్ రెడ్డి అభిమానులు ఆయనను సన్మానించారు. స్వీట్లు తినిపించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద సంబరాలు నిర్వహించారు. మరో వైపు శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి దక్కిందనే ఆయన అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు.మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్న వారిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్,గుమ్మనూరు జయరాంచెల్లుబోయిన వేణుగోపాల్, విడుదల రజని,జోగి రమేష్, ధర్మాన ప్రసాదరావు,దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్ నాథ్,కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్లు ఖరారైనట్టుగా ప్రచారం సాగుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ ముగిసిన తర్వాత కొత్త మంత్రుల పేర్లు సీఎం జగన్ రాజ్ భవన్ కు పంపనున్నారు. ఈ మంత్రివర్గం జాబితా గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత కొత్త మంత్రులకు సీఎంఓ నుండి సమాచారం అందనుంది.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని కేబినెట్ కూర్పుపై కూడా సీఎం జగన్ చర్చిస్తున్నారు. అగ్రవర్ణాలకు కేబినెట్ లో సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుండి మరొకరి సంఖ్యను తగ్గించి బీసీ సంఖ్యను పెంచాలని కూడా జగన్ భావిస్తున్నారు. ఈ దిశగా కసరత్తు చేస్తున్నారు.
2019 లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే సమయంలోనే రెండున్నర ఏళ్లపాటే మంత్రులుంటారని జగన్ చెప్పారు. అయితే మూడేళ్ల తర్వాత మంత్రివర్గాన్న పునర్వవ్యవస్థీకరించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో చెప్పినట్టుగానే ఈ నెల 7వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలోనే మంత్రులను సీఎం జగన్ మంత్రుల నుండి రాజీనామాలు కోరారు. మంత్రులంతా రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే.