ఢిల్లీలోనే ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి: నేడు సోనియా, రాహుల్‌తో భేటీ కానున్న నల్లారి

By narsimha lode  |  First Published May 17, 2022, 11:21 AM IST

కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, మాజీ చీఫ్ రాహుల్ గాంధీలతో ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. నిన్ననే ఆయన న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు చేపట్టాలని కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ నాయకత్వం కోరుతున్నట్టుగా సమాచారం.


న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి   మంగళవారం నాడు  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు.  పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కిరణ్ కుమార్ రెడ్డి సోమవారంనాడే ఢిల్లీకి చేరుకున్నారు.

ప్రత్యేక Telangana  రాష్ట్ర ఏర్పాటును అప్పట్లో ఉమ్మడి ఏపీ రాష్ట్ర సీఎంగా ఉన్న Nallari kiran Kumar Reddy  తీవ్రంగా వ్యతిరేకించారు.2014 ఎన్నికలకు ముందు ఆయన Congress  పార్టీకి గుడ్ బై చెప్పారు. జై సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశాడు.  2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున అభ్యర్ధులను కూడా కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దింపారు. అయితే ఒక్క అభ్యర్ధి కూడా విజయం సాధించలేదు.  ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత ఆయన BJPలో చేరుతారని కూడా ప్రచారం సాగింది. కాంగ్రెస్ పార్టీలోకి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి వస్తారని కూడా చర్చ కూడా జరిగింది. అయితే  ఏ పార్టీలో చేరకుండా కిరణ్ కుమార్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే నిన్న ఆకస్మాత్తుగా  కిరణ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు  కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు.  

Latest Videos

undefined

ఇవాళ కాంగ్రెస్ పార్టీ చీఫ్Sonia Gandhi మాజీ చీఫ్ Rahul Gandhi లతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ ఇంచార్జీ బాధ్యతలు చేపట్టాలని కిరణ్ కుమార్ రెడ్డిని  కాంగ్రెస్ పార్టీ  అధిష్టానం కోరుతుందని సమాచారం. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇవాళ పార్టీ అగ్రనేతలతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ తర్వాత ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

also read:ఢిల్లీలోనే ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి: నేడు సోనియా, రాహుల్‌తో భేటీ కానున్న నల్లారి

ఏపీ రాష్ట్ర పీసీసీ చీఫ్ బాధ్యతలను చేపట్టాలని కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం కోరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. అయితే పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టేందుకు గాను కిరణ్ కుమార్ రెడ్డి  ఆసక్తిగా లేడని చెబుతున్నారు.  అయితే ఎఐసీసీలో కిరణ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుందని ప్రచారంలో ఉంది.  కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా,  రాహుల్ గాంధీలతో కిరణ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాలను చెప్పే అవకాశం ఉంది.

ఏపీలో పీసీసీ చీఫ్ బాధ్యతలను కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించాలని పార్టీ నేతలు కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సూచించారు.ఈ సూచన మేరకు కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీకి రావాలని పిలిచినట్టుగా సమాచారం. అయితే తనను ఎవరు కూడా పిలవలేదని ఢిల్లీలో ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకు చెప్పారు. తాను ఎవరిని కూడా కలవడం లేదని చెప్పారు.

ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జీగా ఉమెన్ చాందీ బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకు వచ్చి పార్టీ పగ్గాలు అప్పగించాలని ప్రయత్నించారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లో చేరలేదు.
 

click me!