
సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వ కమిటీతో సమావేశమయ్యారు ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు. తమ అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా ఇచ్చామన్నారు. ప్రభుత్వం నుంచి మంచి స్పందన వచ్చిందని.. పరిశ్రమకు మంచి జరుగుతుందనే ఆశాభావంతో వున్నట్లు చెబుతున్నారు. కమిటీ సభ్యులు ఓపెన్ మైండ్‌తో వున్నారని.. ప్రేక్షకులకు సంతోషం కలిగే రీతిలో టికెట్ ధరల నిర్ణయం వుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకో మీటింగ్ తర్వాత సిఫార్సులు సిద్ధమయ్యే అవకాశం వుందని ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు అన్నారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అయితే సినిమా టికెట్ ధరల తగ్గింపుపై పలువురు సినీ ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి Perni nani తో ప్రముఖ దర్శకుడు Ramgopal Varma భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై ఈ భేటీలో చర్చించారు. తన అభిప్రాయాలను వర్మ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ వాదనను కూడా ఏపీ మంత్రి నాని రామ్‌గోపాల్ వర్మ దృష్టికి తీసుకొచ్చారు.
సినీ పరిశ్రమకు చెందిన సమస్యలపై ఎవరైనా తమతో చర్చించేందకు తాము సిద్దంగా ఉన్నామని మంత్రి నాని చెప్పారు. రామ్‌గోపాల్ వర్మ మాదిరిగానే ఎవరైనా వచ్చి తమ అభిప్రాయాలను నిరభ్యంతరంగా ప్రభుత్వానికి చెప్పొచ్చన్నారు. రాష్ట్రంలో సినిమా టికెట్ ధరల తగ్గింపు అంశానికి సంబంధించి నిర్మాతలు ఇంకా ప్రభుత్వంతో చర్చించలేదు. ఆన్ లైన్ టికెట్ వ్యవహరానికి సంబంధించి మంత్రి నానితో నిర్మాతలు భేటీ అయ్యారు. ఆ తర్వాత సినిమా టికెట్ ధరల తగ్గింపు అంశంపై మాత్రం నిర్మాతలు ప్రభుత్వంతో ఇంకా భేటీ కాలేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలను తగ్గిస్తే తెలంగాణలో మాత్రం సినిమా టికెట్ ధరల పెంపు విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సినీ పరిశ్రమకు అనుకూలంగా తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకొంది.రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లను నడపాలని ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంతో ఇబ్బంది పడే వాళ్లంతా తమ పినిమాలను వాయిదా వేసుకోవచ్చని మంత్రి నాని సలహా ఇచ్చారు.
ఈ క్రమంలో సినిమా టికెట్ ధరలతో పాటు థియేటర్ల వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన 13 మంది సభ్యుల కమిటీ జనవరి 11న ఏపీ సచివాలయంలో భేటీ అయింది. Andhra pradesh రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ విశ్వజిత్ అధ్యక్షతన సమావేశం జరిగింది. Cinema Ticket రేట్ల తగ్గింపుతో cinema theater యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయని ఎగ్జిబిటర్ వేమూరి బలరాం చెప్పారు. ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన నిబంధనల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 200 సినిమా థియేటర్లు మూతబడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సినిమా థియేటర్లలో నిబంధనలను అమలు చేసే విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరారు.
సినిమా థియేటర్లలో వసతులు, ఫైర్ నిబంధనలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తుతమున్న బీ, సీ సెంటర్లలో సినిమా టికెట్ రేట్లలో మార్పులు చేయాలని ఎగ్జిబిటర్లు కోరారు. రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన 35 నెంబర్ జీవో ఆధారంగానే సినిమా టికెట్ ధరలు ఉండాలని ప్రేక్షకుల సంఘం సభ్యురాలు లక్ష్మి కమిటీని కోరారు. సినిమా థియేటర్లలో మౌళిక సదుపాయాలు లేకపోవడంపై కూడా ఈ సమావేశంలో ఆమె ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో సినిమా టికెట్ ధరలు పెంచాలని తాము ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు.