శ్రీశైలంలో కులసత్రాలపై దేవస్థానానికే అజమాయిషీ : మంత్రి కొట్టు సత్యనారాయణ

By Siva KodatiFirst Published Sep 29, 2022, 5:29 PM IST
Highlights

శ్రీశైల దేవస్థాన పరిధిలోకి కుల సత్రాలను తెస్తామన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. అటు శ్రీశైలం అభివృద్ధికి అటవీ శాఖ నుంచి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. 

శ్రీశైల దేవస్థాన ఆధ్వర్యంలోకి కుల సత్రాలను తెస్తామన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. వాటిపై దేవస్థానం పర్యవేక్షణ వుండేలా ఓ విధానం తెస్తున్నామని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలను దేవస్థానమే కల్పిస్తోందని చెప్పారు. అటు శ్రీశైలం అభివృద్ధికి అటవీ శాఖ నుంచి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. 

కాగా.. శ్రీశైలం అభివృద్ధికి సంబంధించి అటవీ, రెవెన్యూ శాఖల నుంచి వచ్చే ఇబ్బందుల పరిష్కారంపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులతో భేటీ అయ్యామని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. శ్రీశైలం దేవస్థానం నుంచి ఏడు చదరపు మైళ్ల మేర భూమిని దేవస్థానానికి కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. అయితే బౌండరీలు నిర్ణయించకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని కొట్టు సత్యనారాయణ తెలిపారు. శ్రీశైల దేవస్థానాన్ని, ఆలయ పరిధిలోని భూభాగాన్ని కాంక్రీట్ జంగిల్ చేయాలనేది తమ అభిమతం కాదని మంత్రి స్పష్టం చేశారు. 

ALso REad:ఇంద్రకీలాద్రిపై ఐదు స్లాట్స్‌లో దుర్గమ్మ దర్శనాలు.. వీఐపీ లెటర్స్‌పైనా ఆంక్షలు : కొట్టు సత్యనారాయణ

ఇకపోతే గత నెలలో కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఎయిడెడ్ కళాశాలలను ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు అప్పజెప్పబోతున్నామన్నారు. కందుకూరి వీరేశలింగం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని కొట్టు తెలిపారు. 2019కి ముందు 1600 దేవాలయాలకు డీడీఎన్ఎస్ ఇచ్చారని ఆయన వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2 వేలకు పైగా దేవాలయాలకు డీడీఎన్ఎస్ ఇచ్చామని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే 427మందికి ఇచ్చామని.. రాష్ట్రంలోని ప్రతీ దేవాలయంలో దూపదీప నేవేద్యాలు జరపాలనేది సీఎం జగన్ ఆకాంక్ష అన్నారు. 

దేవాదాయ శాఖకు సంబంధించిన అనేక భూములు వివాదంలో ఉన్నాయని మంత్రి వివరించారు. కోర్టుల్లోనూ పలు భూముల కేసు తీర్పులు ప్రయివేటు వ్యక్తులకు అనుకూలంగా వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులు అసిస్టెంట్ కమిషనర్ కు అసైన్ చేసి స్టాండింగ్ కమిటీని పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎండోమెంట్ ఆస్తులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని.. దేవాదాయ ధర్మాదాయశాఖలో పనిచేసే ప్రతీవ్యక్తికి డ్రెస్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకుంటామని కొట్టు సత్యనారాయణ వివరించారు. 

click me!