నా ఆదేశాలను పక్కనపెట్టారు: దుర్గగుడి ఈవోపై దేవాదాయశాఖ కమిషనర్

By narsimha lode  |  First Published Feb 23, 2021, 12:49 PM IST

 దుర్గగుడి ఈవో సురేష్ బాబు  నిబంధనలను ఉల్లంఘించారని దేవాదాయ శాఖ కమిషనర్ అర్జునరావు  చెప్పారు.


విజయవాడ: దుర్గగుడి ఈవో సురేష్ బాబు  నిబంధనలను ఉల్లంఘించారని దేవాదాయ శాఖ కమిషనర్ అర్జునరావు  చెప్పారు.

దుర్గగుడిలో మూడు రోజులుగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ఆలయంలో పనిచేస్తున్న 13 మంది ఉద్యోగులపై దేవాదాయశాఖ కమిషనర్ అర్జునరావు సస్పెన్షన్ వేటేశాడు.

Latest Videos

undefined

దుర్గగుడి ఈవో సురేష్ బాబుపై దేవాదాయ శాఖ కమిషనర్ అర్జునరావు సంచలన ఆరోపణలు చేశారు. సెక్యూరిటీ విషయంలో ఈవో తన ఆదేశాలను పక్కనపెట్టారన్నారు. నిబంధనలను ఉల్లంఘించి మ్యాక్స్ సంస్థకు పనులు అప్పగించారన్నారు. దుర్గగుడి ఆలయంలో మూడు సింహాల విగ్రహాలు చోరీకి మ్యాక్స్ సంస్థ తప్పదమే కారణంగా ఆయన పేర్కొన్నారు.

టెండర్ అప్రూవ్ అవ్వకపోయినా మ్యాక్స్ సంస్థకే టెండర్ ను అప్పగించారన్నారు.తన  ఆదేశాలు పక్కనపెట్టారని ఆయన విమర్శించారు.  అంతేకాదు అడ్డదారిలో మ్యాక్స్ సంస్థకు డబ్బులు కూడా చెల్లించారని అర్జునరావు చెప్పారు.

గత వారంలో మూడు రోజుల పాటు ఏసీబీ అధికారులు సోదాాలు నిర్వహించారు. దుర్గగుడిలో చోటు చేసుకొన్న అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ నివేదిక  ఆధారంగానే చర్యలు తీసుకొన్నారు. 

click me!