అనంతలో విషాదం: బైక్‌పై వెళ్తుండగా విద్యుత్ షాక్, తల్లీ కొడుకు సజీవ దహనం

Published : Feb 23, 2021, 12:22 PM ISTUpdated : Feb 23, 2021, 02:33 PM IST
అనంతలో విషాదం: బైక్‌పై వెళ్తుండగా విద్యుత్ షాక్, తల్లీ  కొడుకు సజీవ దహనం

సారాంశం

అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం వరదాయపల్లిలో విద్యుత్ షాక్ తో  తల్లీ, కొడుకు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన  మంగళవారం నాడు చోటు చేసుకొంది.

అనంతపురం: అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం వరదాయపల్లిలో విద్యుత్ షాక్ తో  తల్లీ, కొడుకు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన  మంగళవారం నాడు చోటు చేసుకొంది.బైక్‌పై తల్లీ కొడుకు  వెళ్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తగిలి విద్యుత్ షాక్ కు గురయ్యారు. దీంతో ఇద్దరు కూడ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.

ఇవాళ ఉదయం బైక్ పై వెంకటస్వామి ఆయన తల్లి వెంకటలక్ష్మి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. 11 కేవీ విద్యుత్ లైన్లు ట్రిప్ అయి తెగిపోయి కిందపడ్డాయి.ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులు గుర్తించలేదు.

ఈ విషయం తెలియని వెంకటస్వామి బైక్ పై వెళ్తున్న సమయంలో ఈ వైర్ తగిలి షాక్ కు గురయ్యారు. వెంటనే వారికి మంటలు అంటుకొని సజీవదహనమయ్యారు.స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వారు మరణించారు. 

విద్యుత్ షాక్ తో తల్లీ కొడుకు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.విద్యుత్ వైర్లు వీరికి ఎలా తగిలాయనే విషయమై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. బైక్ పై వెళ్తున్నవారికి విద్యుత్ తీగలు తగలడానికి కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?