మంత్రులతో ఉద్యోగ సంఘాల నేతల భేటీ: ఆర్ధిక అంశాలపై స్పష్టతకు పట్టు

By narsimha lodeFirst Published Mar 7, 2023, 4:49 PM IST
Highlights

మూడు  ఉద్యోగ సంఘాల నేతలతో  మంత్రుల కమిటీ  చర్చిస్తున్నారు.  ఆర్ధిక పరమైన  అంశాలపై  ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబడుతున్నారు.  
 


అమరావతి: మంత్రుల  కమిటీతో  ఏపీ ఉద్యోగ సంఘాల  నేతలు  మంగళవారంనాడు  చర్చిస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం  ఉద్యోగ సంఘాల  నేతలు  ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.  దీంతో   ఉద్యోగ సంఘాల  నేతలతో   చర్చిస్తున్నారు. 

ఈ నెల 9వ తేదీ నుండి  ఉద్యోగ సంఘాలు  తమ కార్యక్రమాలను  నిర్వహించనున్నారు. దీంతో   మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల  నేతలతో  చర్చిస్తుంది.   ఈ చర్చలకు  సూర్యనారాయణ నేతృత్వంలోని  ఉద్యోగ సంఘాన్ని  చర్చలకు  పిలవలేదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని  ఉద్యోగ సంఘాలకు   మంత్రుల కమిటీ నుండి  చర్చలకు  ఆహ్వానం అందలేదు. 

Latest Videos

ఏపీ జేఏసీ  , అమరావతి జేఏసీ , ప్రభుత్వ  ఉద్యోగుల సమాఖ్యలకు చెందిన  ప్రతినిధులు  ఈ సమావేశానికి హజరయ్యారు. ఒక్కో సంఘం నుండి ముగ్గురు చొప్పున  ఉద్యోగ సంఘాల  ప్రతినిధులు  సమావేశానికి హజరయ్యారు. 

తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు  చేయాలని  ఉద్యోగ సంఘాలు  డిమాండ్  చేస్తున్నాయి.  ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన  బకాయిలతో పాటు  ఇతర అలవెన్సులను వెంటనే  చెల్లించాలని  ఉద్యోగ సంఘాలు డిమాండ్  చేస్తున్నాయి. 

ఆర్ధిక పరమైన  అంశాలపై  ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం నుండి  స్పష్టత కోరుతున్నారు.  ఇదే విషయమై  గతంలో  సూర్యనారాయణ  నేతృత్వంలోని ఉద్యోగ సంఘాల  నేతలు  ఏపీ గవర్నర్ కు ఫిర్యాదు  చేసిన విషయం తెలిసిందే. 
 

click me!