కోడికత్తి తీసుకురావాలి: ఎన్ఐఏ కోర్టు ఆదేశం

By narsimha lode  |  First Published Mar 7, 2023, 3:15 PM IST


కోడికత్తి  కేసు విచారణను ఈ నెల  14వ తేదీకి  కోర్టు  వాయిదా వేసింది.  


విజయవాడ:విశాఖపట్టణం  ఎయిర్  పోర్టులో  వైఎస్  జగన్ పై దాడికి ఉపయోగించిన  కోడి కత్తిని వచ్చే విచారణ  సమయంలో  కోర్టుకు సమర్పించాలని  ఎన్ఐఏ  కోర్టు  ఆదేశాలు జారీ చేసింది.  2018లో  జగన్ పై దాడి  జరిగిన సమయంలో పోలీసులు  సీజ్  చేసిన  వస్తువులను  కోర్టు  ఇవాళ  పరిశీలించింది. అయితే  ఇందులో  కోడి కత్తి లేని విషయాన్ని కోర్టు గుర్తించింది.  వచ్చే విచారణ నాటికి కోడికత్తిని తీసుకురావాలని  కోర్టు ఆదేశించింది. దాడి  చేసిన సమయంలో  జగన్ ధరించిన  చొక్కాను కోర్టు  పరిశీలించింది.  

 కోడికత్తి  కేసుపై విజయవాడ లోని ఎన్ఐఏ కోర్టు   మంగళవారం నాడు విచారణ నిర్వహించింది.  ఇవాళ  దినేష్ కుమార్ ను కోర్టు  విచారించింది.   కేసును  ఈ నెల  14వ తేదీకి వాయిదా  వేసింది  కోర్టు .ఇవాళ విచారణకు  నిందితుడు  శ్రీనివాసరావు  హజరయ్యారు . మరో వైపు ఈ కేసులో  సాక్షిగా  సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్  దినేష్ కూడా  కోర్టుకు  వచ్చారు.  దినేష్ కుమార్ ను ఈ కేసు విషయమై  కోర్టు  విచారించింది. 2018  అక్టోబర్ 25న  విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో  అప్పటి విపక్షనేత వైఎస్ జగన్ పై  కోడికత్తితో  శ్రీనివాసరావు  అనే  వ్యక్తి దాడికి దిగాడు. ఈ ఘటనలో  వైఎస్ జగన్  తృటిలో ప్రాణాపాయం  నుండి తప్పించుకున్నాడు. 

Latest Videos

undefined

ఈ  కేసులో  శ్రీనివాసరావును  పోలీసులు అరెస్ట్  చేశారు.  ఈ కేసును ఎన్ఐఏ విచారణ చేస్తుంది.  ఈ కేసులో  నిందితుడిగా  ఉన్న శ్రీనివాసరావుకు  గతంలో  కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  అయితే  శ్రీనివాసరావుుకు  బెయిల్ ను రద్దు  చేయాలని  ఎన్ఐఏ కోర్టును కోరింది. దీంతో  శ్రీనివాసరావుకు  బెయిల్ ను రద్దు  చేసింది  కోర్టు.

also read:సీఎం జగన్‌ను కలవలేకపోయిన కోడికత్తి శీను కుటుంబ సభ్యులు.. వాళ్లు ఏం చెప్పారంటే..?

ఏపీ సీఎం  వైఎస్ జగన్  ను  కలిసేందుకు  ఈ ఏడాది  జనవరి మాసంలో  కోడి కత్తి  కేసు నిందితుడుశ్రీనివాసరావు పేరేంట్స్  ప్రయత్నించారు. కానీ  వారికి  సీఎం జగన్ అపాయింట్ మెంట్ లభ్యం కాలేదు. నాలుగేళ్లుగా  రాజమండ్రి  సెంట్రల్ జైలులోనే  కోడికత్తి కేసు నిందితుడు  ఉన్నాడు.  శ్రీనివాసరావుకు  ఏడు దఫాలు  బెయిల్  పిటిషన్లు  దాఖలు  చేసినా కూడా  అతనికి  బెయిల్ లభ్యం కాలేదు.  నాలుగేళ్లుగా  జైల్లోనే  మగ్గిపోతున్న   శ్రీనివాసరావుకు  బెయిల్  వచ్చేలా చూడాలని  కుటుంబ సభ్యులు  కోరుతున్నారు. 


 


 

click me!