కృష్ణా జిల్లాలో అధికారుల వేధింపులతో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య: సెల్పీ వీడియో పోస్టు

Published : Jun 04, 2020, 10:13 AM IST
కృష్ణా జిల్లాలో అధికారుల వేధింపులతో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య: సెల్పీ వీడియో పోస్టు

సారాంశం

 అధికారుల వేధింపులు భరించలేక రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకొంది. ఆత్మహత్యకు పాల్పడే ముందు ఆ ఉద్యోగి సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.

విజయవాడ: అధికారుల వేధింపులు భరించలేక రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకొంది. ఆత్మహత్యకు పాల్పడే ముందు ఆ ఉద్యోగి సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.

కృష్ణా జిల్లాలోని రాయనపాడుకు చెందిన రైల్వే కీ మెన్ రాజుగా గుర్తించారు. అధికారులు తనను వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై  ఆయన సెల్పీ వీడియోలో రికార్డు చేశాడు. 

వీడియో రికార్డు చేస్తూనే తన వద్ద ఉన్న పురుగుల మందును తాగాడు. ఇది గుర్తించిన స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అధికారులు ఏ రకంగా తనను వేధింపులకు గురి చేశారోననే విషయమై కూడ వివరించారు. తనను విధులకు హాజరు కాకూడదని కొందరు అధికారులు వేధింపులకు గురి చేశారో వివరించారు. 

ఉన్నతాధికారులపై రాజు చేసిన ఆరోపణలపై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజు ఆరోపణలకు సంబంధించి వాస్తవాలు ఉన్నాయా లేవా అనే కోణంలో కూడ దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇద్దరు పిల్లలతో కలిసి నాగస్వరూపరాణి అనే  మహిళ కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.   ఆమె మృతి చెందారు. ఆమె ఇద్దరు పిల్లలు ప్రమాదం నుండి బయటపడ్డారు. కుటుంబ కలహాలే కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు  చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు