AP EAPCET 2025 Results: ఏపీ ఈఎపీసెట్ 2025 ఫలితాలు, ర్యాంకు కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Published : Jun 08, 2025, 08:44 PM IST
bihar board exam results 2023

సారాంశం

AP EAPCET 2025 Results: ఏపీ ఈఎపీసెట్ 2025 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ వివరాలు మీకోసం.

AP EAPCET 2025 Results: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆదివారం (జూన్ 8, 2025న) ఏపీ ఈఎపీసెట్ (AP EAPCET) 2025 ఫలితాలను విడుదల చేసింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల కోసం నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన cets.apsche.ap.gov.in ద్వారా తమ ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ ఈఎపీసెట్ లో అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల కోసం మే 19, 20 తేదీలలో పరీక్షలు నిర్వహించారు. అలాగే, ఇంజినీరింగ్ కోర్సుల కోసం మే 21 నుంచి మే 27 మధ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 3,62,429 మంది విద్యార్థులు పరీక్షకు నమోదు చేసుకోగా, అందులో 3,40,300 మంది హాజరయ్యారు. మొత్తం 2,57,509 మంది అర్హత సాధించగా, మొత్తం ఉత్తీర్ణత శాతం 75.67% గా ఉంది.

AP EAPCET 2025 results: ఇంజనీరింగ్ వివరాలు

• హాజరైన విద్యార్థులు: 2,64,840

• అర్హత సాధించినవారు: 1,89,748

• ఉత్తీర్ణత శాతం: 71.65%

AP EAPCET 2025 results: అగ్రికల్చర్, ఫార్మసీ వివరాలు

• హాజరైన విద్యార్థులు: 75,460

• అర్హత సాధించినవారు: 67,761

• ఉత్తీర్ణత శాతం: 89.80%

విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ cets.apsche.ap.gov.in/EAPCET ద్వారా తమ స్కోర్‌కార్డు, ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AP EAPCET ఫలితాలు, ర్యాంకు కార్డును డౌన్‌లోడ్ చేసుకునే విధానం

1. అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.inకు వెళ్లాలి.

2. హోమ్‌పేజీలో 'AP EAPCET 2025' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.

3. తర్వాతి పేజీలో 'AP EAPCET Results 2025' లింక్‌పై క్లిక్ చేయాలి.

4. అభ్యర్థి తన రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

5. ఫలితాలు స్క్రీన్‌ పై వస్తాయి. చివరలో ఫలితాలు, ర్యాంకు కార్డు డౌన్ లోడ్ అప్షన్ ఉంటుంది.

6. ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌ తీసుకుని భవిష్యత్తు అవసరాలకు భద్రపరచుకోవాలి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?