రేపు ఏపీ EAPCET ఆన్సర్ కీ విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే?

Published : Jul 07, 2022, 07:49 PM IST
రేపు ఏపీ EAPCET ఆన్సర్ కీ విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే?

సారాంశం

రేపు ఏపీ ఎప్‌సెట్ ఆన్సర్ కీని విడుదల చేస్తున్నట్టు ఏపీఎస్‌సీహెచ్ఈ వెల్లడించింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అభ్యర్థుల కోసం ఈ ఆన్సర్ కీను స్వల్ప వ్యవధి తేడాతో ఆన్సర్ కీని విడుదల చేస్తున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో వీటిని చెక్ చేసుకోవచ్చు. అలాగే, ఏవైనా అభ్యంతరాలు ఉంటే లేవనెత్తడానికి కూడా లింక్ అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపింది.  

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) ఆన్సర్ కీ విడుదల తేదీలను ప్రకటించింది. ప్రిలిమినరీ ఆన్సర్ కీని రేపు విడుదల చేస్తామని తెలిపింది. అలాగే, ఇంజినీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ వారికి క్యాండిడేట్స్ రెస్పాన్స్ షీట్‌ను కూడా విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది. ఈ ఆన్సర్ కీ విడుదల కాగానే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ cets.apsche.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చు.

ఏపీఎస్‌సీహెచ్ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇంజినీరింగ్ స్ట్రీమ్ కోసం ప్రిలిమినరీ ఆన్సర్ కీ తోపాట క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్‌ను జులై 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్టు తెలిపింది. అలాగే, అగ్రికల్చరల్ స్ట్రీమ్ కోసం ప్రిలిమినరీ ఆన్సర్ కీ తోపాటు క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్‌ను జులై 13వ తేదీన ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నట్టు వివరించింది.

AP EAPCET 2022 Answer Key చెక్ చేసుకోవడం ఎలాగంటే?

ముందు అభ్యర్థులు ఏపీఎస్‌సీహెచ్ఈ అధికారిక వెబ్‌సైట్‌ (cets.apsche.ap.gov.in) లోకి వెళ్లాలి. ఆ తర్వాత అక్కడ హోం పేజీలో ఉన్న AP EAPCET 2022 అనే లింక్‌‌ను క్లిక్ చేయాలి. ఏపీ ఎప్‌సెట్ పేజ్‌పై ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ కోసం ఆన్సర్ కీ అందుబాటులో ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయాలి. 

ఆ వెంటనే మరో విండోలో ఆన్సర్ కీ జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది. అక్కడే అందుబాటులో ఉండే ఎఫ్ఐఆర్‌ను భవిష్యత్‌లో అవసరాల దృష్ట్యా డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి.

ఇంజినీరింగ్ అభ్యర్థులు తమ అభ్యంతరాలు ఏవైనా ఉంటే లేవనెత్తడానికి జులై 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇస్తారు. కాగా, అగ్రికల్చర్ అభ్యర్థులకు జులై 15వ తేదీ ఉదయం 9 గంటల వరకు సమయం ఇస్తారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన  లింక్ ద్వారానే లేవనెత్తాల్సి ఉంటుంది. 

ఆన్సర్ కీ అనేది కేవలం ప్రొవిజనల్ మాత్రమే.. వాటిని సవాల్ చేయడానికి వీలు ఉంటుందని అభ్యర్థులు గమనించాలి. అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలను నిపుణులు పరిశీలించి నిర్ధారణ చేసిన తర్వాతే తుది ఫలితాలను విడుదల చేస్తారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్