టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తన ఎడమ చేతి చూపుడు వేలికి రింగ్ పెట్టుకుంటున్నాడు. ఈ రింగ్ లో మైక్రో చిప్ ఉందని చంద్రబాబు ప్రకటించారు. తన ఆరోగ్యాన్ని ఈ చిప్ మానిటర్ చేస్తుందని ఆయన చెప్పారు. తన ఆరోగ్యం విషయంలో ఈ చిప్ ఇచ్చే సమాచారం ఆధారంగా వైద్యులు సలహాలు ఇస్తారని చంద్రబాబు చెప్పారు.
అమరావతి: TDP చీఫ్ Chandrababu తన ఎడమ చేతి చూపుడు వేలికి Ring పెట్టుకుంటున్నాడు. . ఈ నెల 1వ తేదీ నుండి ఈ రింగ్ ఆయన చేతికి కన్పిస్తుంది. ఈ రింగ్ గురించే పార్టీ వర్గాల్లో చర్చసాగుతుంది.ఈ తరుణంలో రింగ్ గురించి చంద్రబాబు స్వయంగా వివరించారు.
చంద్రబాబునాయుడు తన చేతికి ఉంగరాలు ధరించరు. అయితే ఎప్పుడూ లేనిది ఆయన తన చేతికి ఉంగరం కన్పించడంపై ప్రతి ఒక్కరూ అదే ఉంగరంపై చర్చించుకుంటున్నారు. జిల్లాల్లో జరుగుతున్న మినీ మహనాడు కార్యక్రమాలకు హాజరౌతున్న చంద్రబాబు తన చేతికి ఉన్న రింగ్ విషయమై స్వయంగా చెప్పారు.
తన ఎడమ చేతి చూపుడు వేలుకు ఉన్న రింగ్ కు Micro chip ఉందని చెప్పారు. తన ఆరోగ్యాన్ని ఈ చిప్ మానిటర్ చేయనుందని ఆయన చెప్పారు. ఎంత సేపు తాను నిద్రపోయాను, ఎంతసేపు నడిచాను. ఎంత సేపు కూర్చున్నాను., తన శరీరంలో అవయవాలు ఏ రకంగా పని చేశాయనే విషయాలను ఈ చిప్ ను అనుసంధానం చేసిన Computer కు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తుంది. కంప్యూటర్ కు అందిన సమాచారం ఆధారంగా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలనే విషయమై Doctors సలహాలు ఇవ్వనున్నారు. మరో వైపు ముందు రోజు తాను ఎక్కడెక్కడ తప్పు చేశాననే విషయాన్ని గుర్తించి ఆ తప్పులు చేయకుండా ఉండేందుకు ఈ రింగ్ లో ఉన్న చిప్ తనకు సహకరించనుందని చంద్రబాబు చెప్పారు
తన Health విషయమై రింగ్ లో ఉన్న చిప్ మానిటర్ చేయనుందన్నారు. టీడీపీకి సభ్యులంతా ఒకే కుటుంబమన్నారు. టీడీపీలో ఉన్నవారంతా కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.సార్ చెప్పెదేదో చెబుతారు,మేం మాత్రం ఆరోగ్యం విషయంలో పట్టించుకోకపోతే తాను ఏం చేయలేనని చంద్రబాబు చెప్పారు. పార్టీ కార్యకర్తలనుండి నేతల వరకు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
చంద్రబాబునాయుడు చాలా ఏళ్లుగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి పూట భోజనం విషయంలో ఏళ్లుగా ఆయన నియమంగా ఉంటారు. మెనూ ప్రకారంగానే వంట మనుషులు ఆయనకు భోజనం తయారు చేస్తారు. శరీరానికి శక్తినిచ్చే ఫుడ్ ను ఆయన తీసుకుంటారు. మెనూకు విరుద్దంగా ఆయన ఆహారం తీసుకోరు. అదే సమయంలో ఉదయం పూట క్రమం తప్పకుంండా వ్యాయామం చేస్తారు. దీంతో ఆయన ఫిట్ గా ఉంటారు. 2014 కు ముందు వైద్యుల సూచనతో ఆయన కళ్లజోడు పెట్టుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో కంటి చూపు కోసం చేపలు తినాలని వైద్యులు ఆయనకు సూచించారు. దీంతో చేపలను అప్పుడప్పుడు చంద్రబాబు తీసుకొంటారు.