ఒకే చోట మూడేళ్ల పాటు విధులు: బదిలీ చేయాలని ఏపీ డీజీపీ నిర్ణయం

Published : Jan 03, 2023, 11:30 AM IST
 ఒకే చోట మూడేళ్ల పాటు విధులు: బదిలీ చేయాలని  ఏపీ డీజీపీ నిర్ణయం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  పోలీస్ శాఖలో ప్రక్షాళనకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి   నిర్ణయం తీసుకున్నారు. ఒకే చోట మూడేళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

అమరావతి:ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ని పోలీస్ శాఖలో  ప్రక్షాళనకు పోలీస్ బాస్  శ్రీకారం చుట్టారు. ఒకేచోట మూడేళ్లకు  పైగా  పనిచేస్తున్న  ఉద్యోగులను బదిలీ చేయాలని  ఏపీ డీజీపీ  రాజేంద్రనాథ్ రెడ్డి  నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పలు చోట్ల ఒకే స్థానంలో  ఐదేళ్లకు పైగా  ఒకరే విధులు నిర్వహిస్తున్నారని  డీజీపీ ఆఫీస్ గుర్తించింది.  ఒకే స్థానంలో  ఏళ్ల తరబబడి  విధులు  నిర్వహించే సమయంలో  ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని పోలీస్ శాఖ భావిస్తుంది.  ఏళ్ల తరబడి  ఒకే స్థానంలో  విధులు నిర్వహిస్తున్న వారిని గుర్తించి వారిని బదిలీ చేయనున్నారు.  

ఒకే స్థానంలో ఏళ్లతరబడి  ఎంత మంది ఉద్యోగులు  పనిచేస్తున్నారు, ఎందుకు  వీరిని బదిలీ చేయలేదనే విషయాలపై   కూడ పోలీస్ శాఖ   ఆరా తీయనుంది. పోలీస్ శాఖను ప్రక్షాళన చేసే క్రమంలో  డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి  ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖ పనితీరుపై విపక్షాలు  విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే . అధికార పార్టీకి అనుకూలంగా పోలీస్ శాఖ వ్యవహరిస్తుందని  టీడీపీ  తీవ్ర విమర్శలు చేస్తుంది. జనసేన చీఫ్ పనవ్ కళ్యాణ్ కూడా ఇదే తరహలో  పోలీసు్ శాఖపై విమర్శలు చేశారు. గత ఏడాదిలో విశాఖపట్టణంలో తన  కార్యక్రమానికి సంబంధించి  ఐపీఎస్ అధికారి వ్యవహరించిన తీరును  పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి  మరీ  విమర్శలు చేసిన విషయం తెలిసిందే.రాష్ట్రంలో  వైసీపీ అధికారంలోకి వచ్చిన  తర్వాత  తమ  పార్టీ నేతలపై తప్పుడు కేసులు  పెడుతున్నారన్నారు. తమపై తప్పుడు కేసులు పెట్టిన  పోలీసులపై  ప్రైవేట్ కేసులు నమోదు చేస్తామని   పోలీస్ శాఖ ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

New Year Celebrations: కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన రామ్మోహన్ నాయుడు | Asianet News Telugu
వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నసూర్యకుమార్ యాదవ్ దంపతులు | Asianet News Telugu