ట్విట్టర్ లో రెండు ముక్కలు రాస్తే మేధావి అయిపోతావా..: లోకేష్ పై బొత్స విసుర్లు

By Nagaraju penumalaFirst Published Sep 7, 2019, 6:32 PM IST
Highlights

తుగ్లక్ పాలన వైసీపీది కాదని మీనాన్నది తుగ్లక్ పాలన అటూ చమత్కరించారు. తుగ్లక్ అంటే చంద్రబాబు నాయుడేనని ఆ విషయం తెలుసుకోవాలంటూ నారా లోకేష్ కు సూచించారు. హైదరాబాద్ నుంచి మూటా- ముల్లె సర్దుకుని చంద్రబాబు పారిపోయివచ్చిన విషయం లోకేశ్‌ మర్చిపోయాడా అని నిలదీశారు. 
 

అమరావతి : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పై సెటైర్లు వేశారు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. వైయస్ జగన్ పాలనను తుగ్లక్ పాలన అన్న లోకేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్లో రెండు ముక్కలు రాసేస్తే మేధావి అయిపోయారనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు.

తుగ్లక్ పాలన వైసీపీది కాదని మీనాన్నది తుగ్లక్ పాలన అటూ చమత్కరించారు. తుగ్లక్ అంటే చంద్రబాబు నాయుడేనని ఆ విషయం తెలుసుకోవాలంటూ నారా లోకేష్ కు సూచించారు. హైదరాబాద్ నుంచి మూటా- ముల్లె సర్దుకుని చంద్రబాబు పారిపోయివచ్చిన విషయం లోకేశ్‌ మర్చిపోయారా అంటూ నిలదీశారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంద రోజుల పాలనపై విమర్శలు గుప్పిస్తున్న లోకేశ్‌ తన తండ్రిపాలన గురించి కూడా తెలుసుకోవాలని హితవు పలికారు. వందరోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సీఎం జగన్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. పెట్టిన తొలి సంతకాలకు చట్ట రూపం తెచ్చిన వ్యక్తి జగన్‌ అని కొనియాడారు. 

గతంలో చంద్రబాబు పెట్టిన మొదటి సంతకాలకు విలువలేకుండా పోయిందని ప్రతిపక్షంలో ఉండటాన్ని తట్టుకోలేకే ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం ఏనాడైనా తెలుగుదేశం పట్టించుకుందా అని నిలదీశారు. 

కిడ్నీ బాధితుల కోసం 200 పడకల ఆస్పత్రిని సీఎం జగన్‌ ప్రారంభించారని ఆ విషయం చంద్రబాబుకు, లోకేష్ కు కనిపించకపోవడం విచారకరమన్నారు. ఉద్దానంలో ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదన్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

అమరావతి రాజధాని అని గత ప్రభుత్వం గెజిట్ ఇచ్చిందా...?: రాజధానిపై బొత్స వ్యాఖ్యలు

click me!