ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ స్కాం లో నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏసీబీ ప్రకటించింది. 2014 నుండి సీఎంఆర్ఎఫ్ స్కాం విచారణను చేస్తోంది ఏసీబీ.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ స్కాం ( CMRF Scam)లో నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ ఏసీబీ (ACB) ప్రకటించింది. అరెస్టైన నలుగురిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కాగా, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులున్నారని ఏసీబీ ప్రకటించింది.
also read:ఏపీ సెక్రటేరియట్ లో భారీ స్కామ్.. సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల గోల్ మాల్, గుట్టు రట్టు చేసిన ఏసీబీ.. !
2014 నుండి ఏపీ రాష్ట్రంలో సీఆర్‌పీఎఫ్ స్కీమ్ లో అక్రమాలపై జగన్ సర్కార్ విచారణ చేస్తోంది. సీఆర్‌పీఎఫ్ పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణం చోటు చేసుకొందని అనుమానించిన ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ విషయమై ఏసీబీ అధికారులు ఆరు మాసాలుగా విచారణ చేస్తున్నారు.
పీఎంఆర్ఎఫ్ స్కామ్ లో ప్రజా ప్రతినిధుల పీఏలు, ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.చలువాడి సుబ్రమణ్యం (A-1) , సోక రమేష్ (A-2), చదలవాడ మురళీకృష్ణ (A-3) కొండెపూడి జగదీష్ ధన్‌రాజ్(A-4)లను అరెస్ట్ చేసినట్టుగా ఏసీబీ తెలిపింది.సీఎంఆర్ఎఫ్ స్కాంలో ఎంత మొత్తం నిధులు దుర్వినియోగమయ్యాయనే విషయమై ఏసీబీ ప్రకటించలేదు. మరో వైపు ఈ విషయమై ఇంకా ఎందరి ప్రమేయం ఉందనే విషయమై ఏసీబీ ప్రకటించలేదు.