TTD Jumbo committee: ఏపీ హైకోర్టు తీర్పును స్వాగతించిన సోము వీర్రాజు

Published : Sep 22, 2021, 03:05 PM IST
TTD Jumbo committee: ఏపీ హైకోర్టు తీర్పును స్వాగతించిన సోము వీర్రాజు

సారాంశం

టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల జీవోను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేయడాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వాగతించారు. ఈ తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ విషయమై సోము వీర్రాజు బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు

అమరావతి: టీటీడీ (ttd trust board)ప్రత్యేక ఆహ్వానితుల జీవోను ఏపీ హైకోర్టు (AP High court) సస్పెండ్ చేయడాన్ని  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు '(somu veerraju) స్వాగతించారు.ఈ విషయమై సోము వీర్రాజు బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు.  టీటీడీ జంబో పాలకవర్గంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా ఇలాంటి జీవోలు జారీ చేయడం మానుకోవాలని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు.భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం నడుచుకోవాలని ఆయన కోరారు.

also read:జగన్‌కి హైకోర్టు షాక్: టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల జీవో సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన టీటీడీ బోర్డు సభ్యులను నియమించింది. అదే రోజున 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా, ఇద్దరిని ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమిస్తూ వేర్వేరు జీవోలను జారీ చేసింది.ఈ జీవోలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.ఈ పిటిషన్లపై విచారించిన ఏపీ హైకోర్టు ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించిన జీవోను సస్పెండ్ చేసింది.

టీటీడీకి జంబో పాలకవర్గం ఏర్పాటు చేయడాన్ని టీడీపీ సహా పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జగన్ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించాయి.  టీడీపీ నేత ఉమామహేశ్వరనాయుడు, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, మరో వ్యక్తి హైకోర్టుో పిటిషన్ దాఖలు చేశారు. ఈపిటిషన్లపై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు ప్రత్యేక ఆహ్వానితుల జీవోను సస్పెండ్ చేసింది.


 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu