విశాఖ మన్యంలో ఉద్రిక్తత... మావోల కోసం జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 22, 2021, 3:15 PM IST
Highlights

మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల నేపధ్యంలో విశాఖ ఏజెన్సీలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు, సిఆర్ఫిఎప్ జవాన్లు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. 

విశాఖపట్నం: మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోలు పట్టుదలతో వుండగా...ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని పోలీసులు చూస్తున్నారు. ఈ నేపథ్యంల విశాఖ ఏజెన్సీలో పూర్తి స్థాయిలో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ప్రధాన రహదారుల్లో ఇప్పటికే వాహన తనఖీలు చేపట్టారు.

విశాఖ ఏజెన్సీలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు, సిఆర్ఫిఎప్ జవాన్లు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. చింతపల్లి, జి.మాడుగుల వద్ద పోలీస్ బలగాలు ఏజెన్సీ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి ఒక్కరి వివరాలుసేకరిస్తున్నారు. ఏవోబీ పరిసర ప్రాంతాలు కూడా తనిఖీ చేస్తూ ఊర్లో కొత్తవాళ్ళు వస్తే వారి వివరాలు పోలీసువారికి తెలియజేయాలని సూచిస్తున్నారు. 

వీడియో

ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో మావోలు ఎలాంటి హింసకు పాల్పడకుండా కల్వర్టులు, డ్రైనేజీలు, బ్రిడ్జిల వద్ద బాంబు డిస్పోజల్, డాగ్ ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా ఏవోబి మొత్తం జల్లెడ పడుతున్నారు. విశాఖ మన్యంలో సిఆర్పిఎఫ్ జవాన్లు, పోలీస్ సిబ్బంది తనిఖీ కొనసాగుతోంది. 

ఇక వారంరోజులపాటు (సెప్టెంబర్ 21 నుండి 27వరకు) జరిగే ఈ వారోత్సవాల కోసం మావోయిస్టు నాయకత్వం ముమ్మర కసరత్తు చేశారు. ఏజేన్సీ ప్రాంతంలోని ప్రతి గూడేనికి చేరువై ఆదివాసీలను పెద్ద ఎత్తున సమీకరించాలని ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఆదివాసీల్లోకి మావోయిస్టు పార్టీ ఉద్యమ తీవ్రతను తీసుకెళ్లాలని భావించి పోలీస్ వలయాలను చిత్తుచేసి వారోత్సవాలను విజయవంతం చేయడానికి అగ్రనాయకత్వం ప్రయత్నిస్తోంది. 
 

click me!