ఢిల్లీకి క్యూకడుతున్న తెలుగు సీఎంలు: మొన్న కేసీఆర్.. రేపు జగన్

Siva Kodati |  
Published : Dec 14, 2020, 06:36 PM IST
ఢిల్లీకి క్యూకడుతున్న తెలుగు సీఎంలు: మొన్న కేసీఆర్.. రేపు జగన్

సారాంశం

రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. రేపు రాత్రి 9 గంటలకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్ భేటీ కానున్నారు.

రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. రేపు రాత్రి 9 గంటలకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై అమిత్ షాతో జగన్ చర్చించనున్నారు.

పలువురు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలిసే అవకాశముంది. ముఖ్యంగా జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ను కలిసే అవకాశముంది. అలాగే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా జగన్ కలవనున్నారు.

ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. కాగా కొద్దిరోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. రోజుల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu