ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వందల ఎకరాల్లో పంట నష్టపోయింది. దీంతో వరద సహాయం అందించాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశాడు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద సహాయం కింద రూ. 1000 కోట్లు ఇవ్వాలని ఆ లేఖలో కోరారు జగన్.ఇవాళ ఉదయం ఏపీ సీఎం Ys Jagan రాష్ట్రంలో కురిసిన Heavy rains పై సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇంచార్జీలతో సీఎం సమీక్షించారు. ఈ సమీక్షలో ఆయా ప్రాంతాల్లో పంట నష్టం, ప్రాణ నష్టం గురించి ఆరా తీశారు. ప్రాథమికంగా ఆయా జిల్లాల్లో జరిగిన నష్టాల గురించి కూడా సీఎం ఆరా తీశారు. మరో వైపు ఆయా ప్రాంతాల్లో నష్టంపై సమగ్రంగా నివేదికను తయారు చేయాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాల కారణంగా చోటు చేసుకొన్న నష్టంపై అధికారులు ప్రాథమికంగా నష్టం అంచనాలను తయారు చేశారు. ఈ నష్టం అంచనా ఆధారంగా సీఎం జగన్ ప్రధాని Narendra modi ని రూ. 1000 కోట్లు ఇవ్వాలని కోరారు. మరో వైపు రాష్ట్రంలో వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కూడా సీఎం జగన్ ఆ letterలో కోరారు
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఏపీ రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరో వైపు రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. చిత్తూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
also read:ఏపీ వరదలు.. ఏరియల్ సర్వే చేస్తే చాలా, బాధితులకు రూ.25 లక్షలు ఇవ్వాలి: జగన్‌కు బాబు డిమాండ్
కడప జిల్లాలోని రాజంపేట సమీపంలోని చేయ్యేరు ప్రవాహంలో సుమారు 30 మంది గల్లంతయ్యారు. పాపాగ్ని నదిపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. దీంతో తాడిపత్రికి మరో మార్గంలో వాహనాలను తరలిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. రైల్వే బ్రిడ్జిలపై కూడా వరద నీరు చేరిన కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను కూడా రద్దు చేశారు. దెబ్బతిన్న రోడ్లు, రైల్వే బ్రిడ్జిల మరమ్మత్తు పనులు నిర్వహిస్తున్నారు. మరో వైపు చిత్తూరు జిల్లాలోని రాయలచెరువు కట్ట కు లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ కట్టను పూడ్చే పనులు చేపట్టారు.
ఈ నెల 21న తెల్లవారుజామున కడప పట్టణంలోని రాధాకృష్ణనగర్‌లో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో భవనంలో చిక్కుకొన్న తల్లీ కూతుళ్లను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.కడప జిల్లాలోని నందలూరు వద్ద వరద నీటిలో మూడు ఆర్టీసీ బస్సులు చిక్కుకొన్న ఘఢటనలో ముగ్గురు మృతి చెందారు. అనంతపురం జిల్లాలో నదిలో చిక్కుకొన్న ప్రయాణీకులను అధికారులు రక్షించారు.
టెంపుల్ సిటీ తిరుపతి నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. భారీ వర్షం కారణంగా తిరుపతి ఘాట్ రోడ్డు మార్గంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. మరో వైపు మెట్ల మార్గాన్ని టీటీడీ అధికారులు మూసివేశారు. మెట్ల మార్గంలో కొండ చరియలను తీసివేసే ప్రక్రియ కొనసాగుతుంది. తిరుమల ఘాట్ రోడ్డుకు కూడా మరమ్మత్తులు చేస్తున్నారు.