కాలినొప్పి తగ్గిందా మామయ్య..? పరామర్శకు వెళ్లిన సీఎం జగన్ నే పరామర్శించిన చిన్నారులు

By Arun Kumar PFirst Published Dec 3, 2021, 2:48 PM IST
Highlights

ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలం అయిన చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్బంగా వరద బాధితులను ఆత్మీయంగా పలకరిస్తూ సమస్యల గురించి తెలుసుకున్నారు. 

తిరుపతి: ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కడప జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించిన సీఎం తాజాగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. రేణిగుంట మండలం వెదుళ్ల చెరువు ఎస్టీ కాలనీ, ఏర్పేడు మండలం పాపానాయుడు పేటలో సీఎం జగన్ పర్యటించారు.  

kadapa district జిల్లా పర్యటన అనంతరం నేరుగాchittoor district రేణిగుంట విమానాశ్రయానికి ముఖ్యమంత్రి ys jagan చేరుకున్నారు. అక్కడ నుంచి రేణిగుంట మండలంలో వరద ప్రభావిత వెదుళ్ల చెరువు ఎస్టి కాలనీలో ఆయన పర్యటించారు. వరద ప్రభావాన్ని పరిశీలిస్తూనే ప్రభుత్వ సహాయం, పునరావాసం అందిందా? కలెక్టర్ సహా అధికారులు మిమ్మల్ని పరామర్శించారా? అంటూ సీఎం జగన్ నేరుగా బాధిత ప్రజలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన తమను, తమ కుటుంబాలను ప్రభుత్వ యంత్రాంగం ఆదుకుందని బాధితులు సీఎంకు తెలిపారు.

ఇక వెదుళ్ల చెరువులోనూ వరద బాధితులను ఆప్యాయంగా పలకరించిన సీఎం సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే గుత్తివారిపల్లి హైస్కూలుకు చెందిన విద్యార్థులు కాలి నొప్పి ఎలా ఉంది మామయ్య? అని ముఖ్యమంత్రి యోగక్షేమాలనే కనుకున్నారు. బాగుందని చెప్పిన సీఎం కాస్సేపు వారితో ముచ్చటించారు. మీరందరూ బాగా చదువుకోవాలని విద్యార్థులను జగన్ ఆశీర్వదించారు.

read more  వరద బాధితులను ఆత్మీయంగా పలకరిస్తూ... చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన (ఫోటోలు)

ఇక తూకివాకంకు చెందిన ఊహ కోరికమేరకు ఆమె కుమార్తెకు తాను ఉపయోగించే పెన్నును బహుమతిగా ఇచ్చారు సీఎం. అలాగే వరదయ్యపాలెం మండలం ఇందిరా నగర్ గ్రామానికి చెందిన తుపాకుల సుజాత ఫిర్యాదు మేరకు గ్రామ విఆర్వో కె. చలపతి ని వెంటనే  సస్పెండ్ చేయమని కలెక్టర్ కు సీఎం జగన్ ఆదేశించారు. 

 గుత్తివారి పల్లి కి రోడ్డు లేదని.. 30 సంవత్సరాల క్రితం కట్టిన ఇండ్లుతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు తెలుపగా ఈ అంశాన్ని పరిశీలి స్తామని, వెంటనే రోడ్డు ఏర్పాటుకు చర్యలు చేపడతారని వారికి హామీ ఇవ్వడంతో పాటు దీనికి సంబంధించి పనులు చేపట్టాలని అధికారులుకు సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు.

ఆనంతరం ఏర్పేడు మండలం పాపానాయుడు పేట చేరుకున్న సీఎం స్వర్ణముఖి నదిపై వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని పరిశీలించారు. వరదలో ముంపునకు గురైన పొలాలను కూడా సీఎం జగన్ పరిశీలించారు.

read more  వరద బాధితులకు అండగా ఉంటాం: తిరుపతిలో సీఎం జగన్ టూర్

 ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రహదారులు  భవనాలు, జలవనరులు, వ్యవసాయం, పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖలకు సంబంధించి వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు. జరిగన నష్టంతో పాటు తక్షణమే తీసుకున్న సహాయ పునరావాసంపై అధికారులు సీఎంకు వివరాలందించారు. ఈ పర్యటన అనంతరం సీఎం జగన్‌ తిరుపతి పద్మావతి అతిధి గృహానికి చేరుకున్నారు. 

ఈ కార్యక్రమంలో ఉపముఖ్య మంత్రి  నారాయణ స్వామి. జిల్లా ఇంఛార్జి మంత్రి మేకపాటి  గౌతమ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాజంపేట, తిరుపతి ఎంపీలు పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి, పి.గురుమూర్తి, ఎంఎల్సి భరత్, చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

click me!