టీడీపీ నేత దేవినేని ఉమాకు పితృవియోగం..

Published : Dec 03, 2021, 11:50 AM IST
టీడీపీ నేత దేవినేని ఉమాకు పితృవియోగం..

సారాంశం

దేవినేని ఉమా తండ్రి వయస్సు 88సంవత్సరాలు. కంకిపాడు మండలం నెప్పల్లి  శ్రీమన్నారాయణ స్వగ్రామం. కాగా, కంచికచర్లలో స్థిరపడ్డారు. క్రియాశీలక రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనకపోయినప్పటికీ ఆయన ఇద్దరు కుమారులు స్వర్గీయ దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమామహేశ్వరరావుల ఎన్నికల ప్రచారంలో పలు సందర్భాల్లో పాల్గొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత Devineni Umamaheswara Rao ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. దేవినేని ఉమా తండ్రి Devineni Srimannarayana(చిన్ని) కన్నుమూశారు. విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో Heart attackతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఆయన వయస్సు 88సంవత్సరాలు. కంకిపాడు మండలం నెప్పల్లి  శ్రీమన్నారాయణ స్వగ్రామం. కాగా, కంచికచర్లలో స్థిరపడ్డారు. క్రియాశీలక రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనకపోయినప్పటికీ ఆయన ఇద్దరు కుమారులు స్వర్గీయ దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమామహేశ్వరరావుల ఎన్నికల ప్రచారంలో పలు సందర్భాల్లో పాల్గొన్నారు. ఆయనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఇక, ఇవాళ కంచికచర్లలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

వరద బాధితులను ఆత్మీయంగా పలకరిస్తూ... చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన (ఫోటోలు)

శ్రీమన్నారాయణ మృతికి TDP అదినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీమన్నారాయణ మృతి బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు నాయుడు అన్నారు. మరోవైపు శ్రీమన్నారాయణ మృతికి పలువురు టీడీపీ, ఇతర పార్టీల నేతలు సంతాపం తెలియజేశారు. ఆయన మరణవార్త విన్న దేవినేని అవినాష్.. విజయవాడలోని రమేష్ ఆస్పత్రికి వెళ్లి నివాళులర్పించారు. 

దేవినేని నెహ్రూ సతీమణి లక్ష్మి, బాజీ సతీమణి, టీడీపీ కార్పొరేటర్  దేవినేని అపర్ణ. దేవినేని చెందు, వినయ్ ఆస్పత్రి వద్ద నివాళులర్పించారు ఇక, కంచికచర్లలో పలువురు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ నేతలు సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!