కేసీఆర్ బాటలో జగన్.. జిల్లాల పర్యటనకు శ్రీకారం, కడప నుంచే ప్రారంభం

By Siva KodatiFirst Published Jul 6, 2021, 5:22 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ జిల్లాల పర్యటనకు సమాయత్తం అవుతున్నారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టగానే పర్యటన ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. వారంలో రెండు రోజులు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శించనున్నారు సీఎం జగన్.  డిసెంబర్ 31 కల్లా 4,024 గ్రామాలకు ఫైబర్ కనెక్షన్, పంచాయతీల్లో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ జిల్లాల పర్యటనకు సమాయత్తం అవుతున్నారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టగానే పర్యటన ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. వారంలో రెండు రోజులు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శించనున్నారు సీఎం జగన్.  డిసెంబర్ 31 కల్లా 4,024 గ్రామాలకు ఫైబర్ కనెక్షన్, పంచాయతీల్లో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదో తెలుసుకుంటానని సీఎం చెబుతున్నారు. మరోవైపు జగన్ కడప జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారయింది. ఈ నెల 8, 9 తేదీల్లో జగన్ కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. 

Also Read:వ్యాక్సినేషన్ విషయంలో వారికే మొదటి ప్రాధాన్యత: అధికారులకు సీఎం జగన్ ఆదేశం

బద్వేలు మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గానికి సంబంధించిన సుమారు రూ. 400 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి కడప నియోజకవర్గంలో పర్యటిస్తారు. కడపలోని సీపీ బ్రౌన్ పరిశోధన కేంద్రాన్ని సందర్శించి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం వైఎస్ రాజారెడ్డి స్టేడియానికి చేరుకుని విగ్రహాలు, ఫ్లడ్ లైట్లను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత రెండురోజుల పర్యటన ముగించుకుని అదే రోజు సాయంత్రం 6 గంటల సమయంలో సీఎం జగన్ తాడేపల్లికి చేరుకుంటారు. జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు
  

click me!