అమరావతిలో అసైన్డ్ భూదందా: రియల్‌సంస్థ ఉద్యోగికి సీఐడీ నోటీసులు

By narsimha lodeFirst Published Jul 6, 2021, 3:06 PM IST
Highlights

అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహరంలో ఓ రియల్ ఏస్టేట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి ప్రసాద్ కు సీఐడీ అధికారులు  మంగళవారం నాడు నోటీసులు ఇచ్చారు.
 

అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహరంలో ఓ రియల్ ఏస్టేట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి ప్రసాద్ కు సీఐడీ అధికారులు  మంగళవారం నాడు నోటీసులు ఇచ్చారు.అసైన్డ్ భూములను అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఆ పార్టీ నేతలు పథకం ప్రకారంగా అమరావతిలో భూములను  కొనుగోలు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. అసైన్డ్ భూములను కూడ పథకం ప్రకారంగా కొనుగోలు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కొన్ని ఆధారాలను సీఐడీకి అందించారు.  

రియల్ ఏస్టేట్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల పేరునే భూముల అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు చోటు చేసుకొన్నాయని  ప్రసాద్ మీడియాకు చెప్పారు. తన స్వంత భూములను కూడ రియల్ ఏస్టేట్ వ్యాపారి తన పేరున రాయించుకొన్నాడని ఆయన ఆరోపించారు.  ఆనాటి అసైన్డ్ భూముల కొనుగోళ్లు, అగ్రిమెంట్ల వెనుక పెద్దల హస్తం ఉందని ఆయన ఆరోపించారు.తన పేరున ఎంత భూమి ఉందో కూడ తనకు తెలియదన్నారు.ఆ సమయంలో రోజూ పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు. నాటి కొనుగోళ్లు, అగ్రిమెంట్ల వెనుక పెద్దల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఈ విషయాలన్నీ తాను సీఐడీకి వివరిస్తానని తెలిపారు.
 

click me!